Begin typing your search above and press return to search.
పాత స్నేహితుడు కపిల్ దేవ్ తో చిరు సెల్ఫీ
By: Tupaki Desk | 30 Aug 2021 3:29 AM GMTమెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా క్రీడారంగ సెలబ్రిటీలతోనూ మమేకమవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినీరంగంలో అందరివాడిగా కొనసాగుతూ కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు చిరు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఇటీవల గొప్ప క్రీడా నైపుణ్యం ఉన్న ప్రముఖులు సత్కరిస్తూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.
ఇంతకుముందు మెగాస్టార్ స్వయంగా టోక్యో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధును ఘనంగా సత్కరించారు. ఈ సత్కారానికి పరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించగా ఆ ఫోటోలు వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. తాజాగా మరో లెజెండరీ క్రీడాకారుడిని మెగాస్టార్ కలుసుకుని ఆయనతో ఉన్నప్పటి సెల్ఫీలను షేర్ చేయగా అవి అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఇంతకీ ఎవరా స్పెషల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ? అంటే.. ప్రపంచ కప్ గెలిచిన మొదటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో కపిల్ దేవ్ తో మెగాస్టార్ సమావేశమయ్యారు. అతను కపిల్ దేవ్ తో తన సాధారణ సమావేశం అనంతరం కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇందులో చిరు-సురేఖ దంపతులతో పాటు పలువురు అతిథులు ఉన్నారు.
``చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడు కపిల్ దేవ్ ని కలవడం అద్భుతంగా ఉంది. అతను మన దేశానికి మొదటి వరల్డ్ కప్ ను అందించిన హర్యానా హరికేన్`` అని వ్యాఖ్యను జోడించారు. చిరంజీవి - కపిల్ దేవ్ తో కొన్ని సెల్ఫీలను క్లిక్ చేసి వాటిని రిలీజ్ చేశారు. ఆ ఇద్దరూ ఎంతో అఫీషియల్ గా సూట్ లో కనిపిస్తున్నారు. లెజెండరీ క్రికెటర్ తో చిరు భేటీ వెనక కారణం ఏమై ఉంటుంది? అంటే ఇది కేవలం క్యాజువల్ మీటింగ్ మాత్రమే.
60 ప్లస్ లో కెరీర్ పరుగులు..
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోని `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు తదుపరి వరుసగా సినిమాల టైటిల్స్ ని ఫిక్స్ చేసారు. ఆగస్టు 22న మెగాస్టార్ వరుసగా టైటిల్స్ ని ప్రకటించారు. ఇందులో గాడ్ ఫాదర్ - భోళా శంకర్ టైటిల్స్ అధికారికం అయ్యాయి. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` షూటింగ్ లో చిరు జాయిన్ అయ్యారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చర్చి ఫాదర్ గా కనిపించనున్నారు. టైటిల్ పాత్రతో చిరంజీవి మెస్మరైజ్ చేస్తారని సమాచారం. అలాగే తమిళ సినిమా `వేదాళం` రీమేక్ లోనూ చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు.
అలాగే మెగా అభిమాని.. యవ దర్శకుడు బాబి దర్శకత్వంలో ఓ ఫ్యాన్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి `వాల్తేరు వీరన్న` లేదా `వాల్తేరు శీను` అనే మాసీ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. వాల్తేరు అనేది విశాఖపట్ణణంలో ఫేమస్ ఏరియా. టైటిల్ ని బట్టి వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. వీరన్న టైటిల్ పై కొందరు పాతగా ఉందంటూ అభ్యంతరం చెప్పడంతో మార్చాలనే ఆలోచన చేస్తున్నారని అందుకే బర్త్ డే రోజున ప్రకటించలేదని కూడా గుసగుసలు వినిపించాయి. చిరు వరుసగా మాస్ లీడర్ గా.. సోదరి సెంటిమెంట్ ఉన్న జెంటిల్ మన్ గా.. మాస్ మ్యాన్ గా విలక్షణమైన పాత్రల్ని ఎంచుకుని తిరిగా ``బాస్ ఈజ్ ఆల్వేస్ సెన్సేషన్`` అని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు.