Begin typing your search above and press return to search.

చిరు సార్.. ఇంకా ఎన్నాళ్ళీలా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 AM GMT
చిరు సార్.. ఇంకా ఎన్నాళ్ళీలా?
X
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు అందుకున్నాడని అందరూ భావిస్తున్నారు. కానీ అసలైన మెగాస్టార్ చిరంజీవిని మిస్ అవుతున్నామని ఆయన అభిమానులు వాపోతున్నారు. అదేంటి దాదాపుగా 100 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది. వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇంకా ఆయన అభిమానులు బాధపడడం ఏమిటి అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి చివరిగా సోలోగా వచ్చి ఎలాంటి రీమేక్ సినిమా కాకుండా డైరెక్ట్ హిట్ కొట్టింది ఇంద్ర సినిమాతో. ఈ సినిమా విడుదలై దాదాపుగా 20 ఏళ్లు పైనే అయింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న అన్ని సినిమాలు మల్టీస్టారర్ సినిమాలు. లేదా వేరే భాషలో సూపర్ హిట్గా నిలిచిన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నవే. ఆయన అభిమానులు ఇప్పటికే రీమేక్ సినిమాల విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా... ఇప్పుడు మల్టీస్టారర్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి.

ఎందుకంటే నిజంగా ఆయా సినిమాలు మెగాస్టార్ చిరంజీవి చరిష్మాతో ఆడిన మరో హీరో ఉంటాడు. కాబట్టి సగం క్రెడిట్ ఆయనకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులంతా భావిస్తున్నారు.

అయితే దురదృష్టం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా ఒక రీమేక్ సినిమానే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమా అని తెలుగులో భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది.

ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బహుశా ఈ సినిమా అయినా డైరెక్ట్ తెలుగు సినిమా అవ్వాలని ఫ్యాన్స్ అంతా దండాలు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యలో వీవీ వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ విశ్వాసం అనే ఒక సినిమా చేయబోతున్నారనే వార్త వారందరికీ ఒక పిడుగుల మారింది. అది నిజం కాకూడదని వారంతా దేవుళ్లను మొక్కుకుంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.