Begin typing your search above and press return to search.
ఒక దర్శకుడి వలన నాకు చాలా మనస్థాపం కలిగింది:చిరంజీవి
By: Tupaki Desk | 11 Oct 2021 5:30 AM GMTరోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. నిన్నరాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చాలా హుషారుగా సందడి చేశారు. రాఘవేంద్రరావుతో తనకి గల అనుబంధం .. ఆయనతో కలిసి కొనసాగిన తన ప్రయాణానికి సంబంధించిన విషయాలను ఆయన అభిమానూలతో కలిసి పంచుకున్నారు. "రాఘవేంద్రరావుతో నాది సుదీర్ఘమైన ప్రయాణం. అప్పట్లో ఆయన దర్శకత్వంలో నటిస్తేనే ఇండస్ట్రీలో ఒక సుస్థిరమైన స్థానం ఉంటుంది అనే ఒక నమ్మకం మా అందరిలో ఉండేది. ఆయనతో చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవాడిని.
'మోసగాడు' అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాను గానీ, నాకు అంతగా తృప్తిని ఇవ్వలేదు. ఆయనతో ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటూ ఉండగా 'అడవిదొంగ' చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది .. ఎంతగా కనకవర్షం కురిపించింది తెలిసిందే. రామారావుగారు రాజకీయాల వైపు వెళ్లిపోయిన తరువాత, ఆర్ధికంగా రికార్డ్స్ ఆ స్థాయికి ఉంటాయా? లేదా అనే మీమాంసలో ఇండస్ట్రీ ఉంది. అప్పుడు రాఘవేంద్రరావు గారు నాకు అవకాశం ఇచ్చి, వసూళ్ల పరంగా ఆ స్థాయి రికార్డులను అందుకోగలిగారు. అందులో నేను కూడా భాగస్వామిని అయినందుకు గర్వపడ్డాను.
ఆయన దర్శకత్వంలో చేశాను .. ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడినయ్యాను. ఇక నాకు తిరుగులేదు అని ఆ క్షణంలో నేను అనుకున్నాను. ఇక నాకు ఢోకా లేదనే భరోసా వచ్చింది. అలాంటి భరోసా ప్రతి ఆర్టిస్ట్ కి ఇచ్చి .. వాళ్లకి స్టార్ స్టేటస్ ని కాంక్రీట్ గా ఇచ్చిన గొప్ప దర్శకులు మన రాఘవేంద్రరావు. అందుకే వారంటే నాకు ఒక గురుభావన ఉంటుంది. నా సినీ జీవితానికి ఆయన ఓ భరోసా. అది పక్కన పెడితే, ఆయన నన్ను ఎంతో ఆత్మీయంగా 'బాబాయ్' అని పిలుస్తుంటారు. ఆ పిలుపుకు నేను ఎప్పుడూ దాసోహమే. ఆయన నా ప్రతి సినిమాకి నా భుజం తట్టి ప్రోత్సహించేవారు.
'అడవిదొంగ' సినిమా సమయంలో నేను ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ముచ్చటగా చూసేవారు. ఇంతగా కష్టపడుతున్నావంటే నీకు తిరుగు లేదు బాబాయ్ అనేవారు. ఆ మాట ఎంతో ఉత్సాహంగా ఉండేది. 'ఘరానా మొగుడు' సినిమా కోసం విశాఖ డాల్ఫీన్ హోటల్లో నైట్ రిహార్సల్స్ చేస్తుంటే, నీకు అవసరమా అనేవారు. పబ్లిక్ లో టేక్ 2 తీసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను చెప్పాను. అలా నేను ఎంతో కష్టపడుతూ ఉంటే ఇష్టంగా చూస్తూ ప్రోత్సహించేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక దర్శకుడి వలన నాకు మనస్థాపం కలిగింది.
అప్పుడు నేను నేరుగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్లాను. మనసు బాగోలేదు కాస్త సేదతీరాలని వచ్చానని అన్నాను. మీలాగా ఆర్టిస్టులను ప్రేమగా చూసే గుణాన్ని దర్శకులు నేర్చుకోవాలి సార్. అలాంటి దర్శకులు ఎక్కడా కనిపించడం లేదు. అందుకే మీ దగ్గర ఊరట పొందడానికి వచ్చానని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను ఎంతో అభిమానంతో హత్తుకున్నారు. ఆ సమయంలో నా కళ్లు చెమర్చాయి. ఆయన సినిమాల్లో పనిచేయడానికి ఆర్టిస్టులు పరితపించడానికి కారణం, ఆర్టిస్టులను ఆయన బిడ్డల్లా చూసుకుంటారు. లాలిస్తారు .. పాలిస్తారు .. అక్కున చేర్చుకుంటారు. నేటి దర్శకులు అది నేర్చుకోగలిగితే అది కచ్చితంగా యాడెడ్ క్వాలిటీ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.