Begin typing your search above and press return to search.
కృష్ణ గారికి దక్కాల్సింది దక్కలేదు : చిరు
By: Tupaki Desk | 6 Jan 2020 4:24 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరు అయిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అందరిని మెప్పించింది. మొదట మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి సరిలేరు నీకెవ్వరు చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ఈ చిత్రంకు మహేష్ బాబు పారితోషికం తీసుకోకుండా సినిమాను చేసినట్లుగా తెలుసుకున్నాను. మొదట రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేయడం అనేది నిర్మాతకు చాలా మంచి చేస్తుందని అన్నాడు.
మహేష్ బాబు వంటి కుమారుడు ఉన్నందుకు కృష్ణ గారు చాలా అదృష్టవంతులు అన్నారు. ఈ సందర్బంగా కృష్ణ గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు షిప్ట్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో కృష్ణ ఒకరు. ఆయన ఎన్నో సాహస నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా.. దర్శకుడిగా.. స్టూడియో అధినేతగా సినిమాలు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు.
కృష్ణ గారు తెలుగు సినిమాకు అంత చేసినందుకు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తాను భావిస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కృష్ణ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చేందుకు కృషి చేయాలి.. ప్రతి ఒక్కరు అందుకోసం డిమాండ్ చేయాలి. ఇది ఆయనకు దక్కే గౌరవం కాదు.. ఆయన వల్ల తెలుగు సినిమాకు దక్కే గౌరవం అంటూ చిరంజీవి వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో అంతా కూడా కృష్ణ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలంటూ కరతాళ ద్వనులతో డిమాండ్ చేశారు.