Begin typing your search above and press return to search.
ఆచార్య పూర్తయ్యాక చిరు సుదీర్ఘ విరామం
By: Tupaki Desk | 25 May 2021 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాలతో `ఆచార్య` పెండింగ్ చిత్రీకరణను త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. షూట్ పునఃప్రారంభించిన తర్వాత సుమారు 2 వారాల్లో తుది షెడ్యూల్ పూర్తవుతుంది. ఆచార్య పూర్తయిన తర్వాత చిరంజీవి సుదీర్ఘ విరామం తీసుకుంటారని తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ ను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశమే లేదట.
ఆచార్య చిత్రీకరణ పూర్తయ్యాక కోవిడ్ సాధారణ స్థితికి వచ్చే వరకు చిరంజీవి వేచి చూస్తారట. `వేదాళం` రీమేక్ సహా లూసిఫెర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. మరో ఇద్దరు దర్శకులు ఆయన కోసం వేచి చూస్తున్నారు.
ఆచార్య గురించి కొరటాల తాజాగా ఆసక్తికర అప్ డేట్స్ ని అందించిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి - రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో కనిపిస్తారు. చెర్రీ స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అతని పాత్రపై అంచనాలను పెంచింది. మరోవైపు చరణ్ `ఆచార్య`లో జాయినయిన నాటి నుంచి అతడు ఈ చిత్రంలో చిరు కుమారుడిగా కనిపిస్తాడని అనేక ఊహాగానాలు సాగాయి. అయితే చిరు.. చరణ్ తన సినిమాలో తండ్రి- కొడుకులుగా నటించడం లేదని కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఊహించినట్లుగా చరణ్ 20 నిమిషాల అతిధి పాత్రలో నటించడం లేదని ఈ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో నటిస్తారని సెకండాఫ్ అంతా కనిపిస్తారని వెల్లడించారు.