Begin typing your search above and press return to search.
సల్లూ భాయ్ కి గాడ్ ఫాదర్ వీడియో సందేశం..!
By: Tupaki Desk | 8 Oct 2022 4:17 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేశారు. మసూమ్ భాయ్ అనే షార్ప్ షూటర్ పాత్రలో కండలవీరుడు కనిపించారు. ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. దసరా కానుకగా విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది.
'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో చిరంజీవి హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సినిమాల రేంజ్ లో ఓపెనింగ్స్ రాకపోయినా.. ఇది సీనియర్ హీరోకి నూతనోత్సాహం తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ వీడియో ద్వారా చిరు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
'గాడ్ ఫాదర్' విడుదల తర్వాత సినిమా విజయవంతమైనందుకు చిరంజీవి కి అభినందనలు తెలుపుతూ సల్మాన్ ఖాన్ ఓ వీడియో సందేశం ఇచ్చారు. ''డియర్ చిరు గారూ.. ఐ లవ్ యూ. 'గాడ్ ఫాదర్' చాలా బాగా నడుస్తోందని విన్నాను. దానికి మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ చిరు గారూ. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఈ దేశంలో.. దేశ ప్రజలలో గొప్ప శక్తి ఉంది. వందేమాతరం'' అని సల్మాన్ పేర్కొన్నారు.
సల్మాన్ ఖాన్ వీడియో పై చిరంజీవి స్పందిస్తూ.. ప్రతిగా ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''నా ప్రియమైన సల్లూ భాయ్ కి ధన్యవాదాలు.. మీకు కూడా అభినందనలు. 'గాడ్ ఫాదర్' యొక్క అద్భుతమైన విజయం వెనుక ఉన్న శక్తి మసూమ్ భాయ్. థాంక్యూ.. లవ్ యూ సో మచ్. వందేమాతరం'' అని చిరు అన్నారు.
కాగా, 'గాడ్ ఫాదర్' సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారిక పోస్టర్ వదిలారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా ఉన్నప్పటికీ.. చిత్ర బృందం చెప్పిన స్థాయిలో వసూళ్ళు రాలేదని నివేదిస్తున్నారు. 93 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన మెగాస్టార్.. ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తారో చూడాలి.
మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' మూవీ తెరకెక్కింది. తెలుగు వెర్షన్ లో చాలానే మార్పులు చేశారు. ఇందులో నయనతార - సత్యదేవ్ - సముద్రఖని - సునీల్ - తాన్యా రవిచంద్రన్ - మురళీ శర్మ - అనసూయ - బ్రహ్మాజీ - పూరీ జగన్నాథ్ తదితరులు నటించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాయగా.. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తెలుగులో పాటుగా హిందీలోనూ 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే నార్త్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.