Begin typing your search above and press return to search.
చిరు వర్సెస్ చరణ్! ఢీ అంటే ఢీ అంటారట!!
By: Tupaki Desk | 4 July 2021 5:36 AM GMTరెండు సార్లు లాక్ డౌన్ సీజన్లను సరిగా సద్వినియోగం చేసుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ అందరికీ స్ఫూర్తిని నింపింది. ఓవైపు కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి సేవలందిస్తూనే.. మరోవైపు తన తదుపరి చిత్రాలకు సంబంధించిన కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేస్తూ బిజీ గా గడిపారు. ఇప్పటికే నలుగురు దర్శకులు మెగాస్టార్ క్యూలో ఉన్నారు.
సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిన `ఆచార్య` చిత్రీకరణ కోసం చిరు ప్రస్తుతం సన్నాహకాల్లో ఉన్నారు. చిరు-కొరటాల బృందం ఈ నెలాఖరు నుంచి కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్లు ఆన్ లొకేషన్ కుస్తీలు పడుతుంటే చిరు మాత్రం కాస్త వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. నెలాఖరు నాటికి ఆయన సెట్స్ పైకి వెళతారని తెలిసింది. అయితే ఈలోగానే ఈ నెలరోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొరటాల ప్లాన్ చేశారు.
రామ్ చరణ్ పై ఈ నెల 6 నుండి ఒక భారీ ఫైట్ ని చిత్రీకరించనున్నారని తెలిసింది. ఆచార్యలో ఇది చరణ్ ఎంట్రీ సీన్ అని కూడా తెలుస్తోంది. ఇంతకుముందే చరణ్ - పూజా హెగ్డే జంటపై కీలకసన్నివేశాలు సహా పాటల్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించే సోషియో పొలిటికల్ డ్రామాతో ఈ చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇందులో దేవాదాయ శాఖ కుంభకోణాలపైనా ఆసక్తికర అంశాల్ని కొరటాల టచ్ చేశారన్న గుసగుసలు ఇంతకుముందు వినిపించాయి. ఇక చిరు-చరణ్ జోడీ కలిసి ఉన్న పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలో సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి.