Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ మెహబూబ్ కి మాటిచ్చి నిలబెట్టుకున్న చిరు
By: Tupaki Desk | 21 March 2021 1:30 PM GMTకింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ - సీజన్ 4 చక్కని ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇంటి సభ్యునిగా కొరియోగ్రాఫర్ మెహబూబ్ ప్రదర్శనను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అమ్మ రాజశేఖర్ శిష్యుడిగా అతడు షోలో చాలా వరకూ ఆకట్టుకున్నాడు. అతడు డ్యాన్సులతోనూ అదరగొట్టాడు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ లో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాక సన్నివేశాన్ని ఎవరూ మర్చిపోలేరు.
మెహబూబ్ సొంత ఇంటి నిర్మాణం కోసం రన్నర్ గా నిలిచి అవార్డ్ మనీ సంపాదించిన బెస్ట్ ఫ్రెండ్ సోహెయిల్ 5లక్షలు సాయం ప్రకటించగా.. ఆ స్నేహానికి ఉప్పొంగిన హోస్ట్ నాగార్జున ఆ స్నేహితుల కోసం తానే ఆ ఐదు లక్షల్ని డొనేట్ చేసారు. ఇక ఆ ఎపిసోడ్ లో స్నేహానికి మైమరిచి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 5 లక్షలు డొనేట్ చేసారు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఇక మెహబూబ్ ని చూడగానే తనని తాను చూసుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించిన మెగాస్టార్ అతడికి తన సినిమాలో ఆఫర్ ఇస్తానని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.
ముందే ఇచ్చిన మాట ప్రకారం ఆచార్య చిత్రంలో మెహబూబ్ కి ఒక సర్ ప్రైజ్ రోల్ ని ఆఫర్ చేశారు. జనవరి 20 నుండి మొదలైన షెడ్యూల్ లో మెహబూబ్ షూటింగులో పాల్గొంటున్నారట. అతడు జానపద నృత్యకారుడిగా నటిస్తున్నారని.. ఇంటర్వెల్ లో అతని పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఆచార్యలో ఆ పాత్ర ఎమోషన్ ని రగిలించేదిగా ఉంటుందట. చిరు తన పార్ట్ లో యాక్షన్ మినహా ఇతర సీన్లన్నీ శరవేగంగా పూర్తి చేయమని కొరటాలకు చెప్పారట. ఇందులో శ్రీధర్ సీపాన ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ కూడా రాస్తున్నారని తెలిసింది.