Begin typing your search above and press return to search.
నెల రోజుల పాటు చిరు ఎవరికీ కనిపించరు
By: Tupaki Desk | 3 May 2022 11:30 AM GMTనెలరోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి ఎవరికీ కనిపించరు. చిక్కడు దొరకడు అనేలా ఇప్పుడు ఆయన వెకేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ చిరు ఎక్కడికి వెళుతున్నారు? అంటే... తన కుటుంబంతో కలిసి ఒక నెల రోజుల పాటు అమెరికా వెకేషన్ కి వెళుతున్నారని తెలిసింది.
నిజానికి ఆచార్య కోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమించారు. ఏడాది పైగా కరోనా క్రైసిస్ ఇబ్బంది పెట్టినా ఆయన పని ఆపలేదు. అప్పట్లోనే సెలవు తీసుకోవాలని భావించారు. కానీ పరిస్థితులు ఆలస్యానికి కారణమయ్యాయి.
ఇన్నాళ్టికి ప్రయాణం కుదిరింది. ఆయన శ్రీమతి సురేఖతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఇది అభిమానుల్లో వైరల్ అవుతోంది.
మే డే వేడుకల కోసం..!
మెగాస్టార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మే 1వ తేదీన అమెరికాకు విహారయాత్రకు వెళ్లాల్సి ఉంది. కానీ సినీ పరిశ్రమలో మేడే వేడుకలకు హాజరు కావాల్సిందిగా తమ్మారెడ్డి భరద్వాజా బృందం చిరుని ఆహ్వానించారు. అందుకే ఈ ఈవెంట్ కి ప్రాధాన్యతనిస్తూ చిరు తన ట్రిప్ ను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు ప్రయాణం ఇప్పటికి కుదిరింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. గాడ్ ఫాదర్ చిత్రంతో పాటు భోళా శంకర్ .. వాల్తేరు వీరన్న చిత్రాల్లో నటిస్తున్నారు. లూసిఫర్‌కి రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుంటే.. వేదాళం రీమేక్ గా భోళా శంకర్ రూపొందుతోంది. వాల్తేరు వీరన్న కథను బాబి ఒరిజినల్ గా క్రియేట్ చేసారు. వెంకీ కుడుముల.. మారుతి వంటి యువదర్శకులకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.