Begin typing your search above and press return to search.

#కోవిడ్ ఫండ్ రైజ‌ర్.. స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ స‌ర‌స‌న చిరు పేరు!

By:  Tupaki Desk   |   17 Aug 2021 10:30 AM GMT
#కోవిడ్ ఫండ్ రైజ‌ర్.. స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ స‌ర‌స‌న చిరు పేరు!
X
క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సేవ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి వేవ్ స‌మ‌యంలో సినీకార్మికుల‌కు క‌ష్టంలో ఉన్న‌వారికి సాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను చేప‌ట్టి ప్రాణ దాత అయ్యారు. అయితే ఈ సేవ‌ల‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కుతోంది.

రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు `వియ్ ఫర్ ఇండియా` పేరుతో చారిటీ కార్య‌క్ర‌మం చేసి భార‌త‌దేశంలో కోవిడ్ కి సంబంధించిన ఫండ్ ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందులో చిరు పాల్గొన్నారు. 5 మిలియ‌న్ డాల‌ర్ల నిధి సేక‌ర‌ణ కోసం కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పోర్ట‌ల్ డెడ్ లైన్ డాట్ కాంలో ప్ర‌ముఖంగా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

ఇక కోవిడ్ స‌మ‌యంలో తాము చేసిన సేవ‌ల‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్య‌మాల లైవ్ వేదిక‌గా చిరు డెమో ఇచ్చారు. ఇలా చేసిన ప్ర‌ముఖుల్లో హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ స‌హా మెగాస్టార్ చిరంజీవి పేరు వైర‌ల్ అయ్యింది. అలాగే ఈ జాబితాలో హృతిక్ రోష‌న్- అజ‌య్ దేవ‌గ‌న్ త‌దిత‌రులు ఉన్నారు.

ఆగ‌స్టు 15 రాత్రి గ్లోబల్ ఫండ్ రైజర్ `వియ్ ఫర్ ఇండియా` భారతదేశంలో కోవిడ్ బాధితుల సేవ‌కోసం నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేసింది. ఇది వర్చువల్ ఈవెంట్.. వినాశకరమైన వైరస్ పై దేశ పోరాటానికి సహాయపడటానికి 5మిలియ‌న్ డాల‌ర్ల‌ను సమీకరించి గొప్ప విజ‌యం సాధించామ‌ని ఫండ్ రైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది. దీనికోసం పాపుల‌ర్ స్టార్లు ముందుకు రావ‌డం విశేషం. పశ్చిమ నుండి ప్రముఖ పేర్లతో సహా స్టీవెన్ స్పీల్‌బర్గ్ -మిక్ జాగర్ ప్రత్యేక మద్దతు సందేశాలను అందించారు.

ఇక ఇందులో చిరంజీవి- నాగార్జున‌- అజయ్ దేవగన్- హృతిక్ రోషన్ - రాజ్‌కుమార్ హిరానీ -కబీర్ ఖాన్ సహా అనేకమంది భారతీయ తారలు త‌మ‌వంతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు నిర్వహించారు. ఆగ‌స్టు 15 సాయంత్రం ఫేస్ బుక్ లో ఈ కార్య‌క్ర‌మం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పటికీ ఈ వీడియోని ఎఫ్ బీలో చూడవచ్చు. నిర్వాహకులలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్- గివిండియా- ది వరల్డ్ వి వాంట్ - ఫేస్ బుక్ ఉన్నాయి. మొత్తంగా ఐదు గంటలు పైగా సాగిన‌ ఈవెంట్ లో 100 మంది పైగా వినోదప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు.. ప్రభావశీలులు .. సంగీత కళాకారులు పాల్గొన్నారు.

భారతదేశానికి మానవతా సాయం అందించడం.. మన ఆరోగ్య మౌళిక సదుపాయాలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తుచేసేందుకు గొప్ప కార్య‌క్ర‌మ‌మిది అని రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్ర‌తినిధులు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

పాల్గొన్న వారి పూర్తి జాబితా ఇలా ఉంది:

A.R. రెహమాన్- చిరంజీవి-నాగార్జున‌- అజయ్ దేవగన్- అజిత్ - అదా శర్మ- అదితి రావు హైదరి- అలయ ఎఫ్- అమిత్ మిశ్రా- అమిత్ టాండన్- అనన్య పాండే- అనన్య బిర్లా- అంగిరా ధర్,.. అంకుర్ తివారీ,..అన్నీ లెన్నాక్స్,.. అర్జున్ కపూర్,.. అర్జున్ మాథుర్, ..అతుల్ సతీజా ,.. బిక్రమ్ ఘోష్,.. BOI - డా. రిచా (ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్), BOI - వైభవ్ (ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్),.. BOI - వేనిక (ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్), .. దీపాలి ఖన్నా,.. దియా మీర్జా,.. దినా షిహాబి, ..దివ్యెందు శర్మ + హాస్టల్ బాయ్స్,.. డా. అంకేశ్ సహేత్య, ..డాక్టర్ హిమాన్షు మెహతా, ..డాక్టర్ సంజయ్ అరోరా,.. డాక్టర్ తనూ సింఘాల్, ... ఎడ్ షీరన్, ..ఫరా ఖాన్,.. ఫర్హాన్ అక్తర్, .. ఎఫ్ బి కమ్యూనిటీ - మహిత నాగరాజు,.. ఎఫ్ బి కమ్యూనిటీ - మైఖేల్ ఖన్నా, ..ఎఫ్ బి కమ్యూనిటీ - సోనియా కొంజేటి (పూల పూణే లేడీస్),.. గురు రాంధవా,.. హర్మీత్ సింగ్, . హార్డీ సంధు, హృషితా భట్, ..ఇంతియాజ్ అలీ,.. ఇని డిమా-ఓకోజీ, ..జావేద్ జాఫేరి, జావేద్ అక్తర్,.. జానీ లివర్,.. కబీర్ ఖాన్,.. కల్కి కోచ్లిన్, ..కనికా కపూర్, కరణ్ జోహార్ కె. వహి,.. కరిష్మా కపూర్,.. కార్తీక్ ఆర్యన్,... కీర్తి కుల్హరి, ..లిసా మిశ్రా, ..లోలా లెన్నాక్స్,.. మహేష్ భూపతి,.. మలైకా అరోరా,.. మనీష్ మల్హోత్రా,.. మంజరి ఫడ్నిస్,.. మన్మీత్ సింగ్,.. మీజాన్,.. ఆర్. మాధవన్, రాహుల్ బోస్,.. రాజ్‌కుమార్ హిరానీ,.. రాజ్‌కుమార్ రావు,.. రకుల్ ప్రీత్ సింగ్,.. రెమో డిసౌజా,.. రిభు దాస్ గుప్త,.. సైఫ్ అలీ ఖాన్, .. సానియా మీర్జా.. సన్యా మల్హోత్రా, సపన్ వర్మ, ..సకీబ్ సలీమ్, సారా అలీ ఖాన్, శంకర్ మహదేవన్,.. శంతను మొయిత్రా,.. శరద్ కేల్కర్,.. శేఖర్ రవ్ జయాని, ..శిబాశిష్ సర్కార్,.. శిల్పా కుమార్,.. శిల్పా శెట్టి కుంద్రా .. శ్రేయాస్ తల్పాడే,.. సిద్ధాంత్ చతుర్వేది,.. సిద్ధాంత్ కపూర్,.. సిద్ధార్థ్ మల్హోత్రా,.. సిస్టర్ స్లెడ్జ్ అడుగు స్లెడ్జ్ డెండరీ,.. సోనాక్షి సిన్హా, ..సోనూ సూద్,.. సుకృతి కాకర్, ..సులైమాన్ మర్చంట్,.. స్వానంద్ కిర్కిరే, ..తాన్య మణిక్తలా త‌దిత‌రులు పాల్గొన్నారు.