Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అమ్మతో అంజనీ పుత్రుడు
By: Tupaki Desk | 30 Jan 2020 6:09 AM GMTమెగాస్టార్ చిరంజీవికి తన తల్లిగారు అంజనమ్మ అన్నా.. ఆంజనేయుడు అన్నా.. ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అందుకే అంజనీ పుత్రుడా? అంటూ ఆయనపై లిరిక్ నే రాశారు ఓ ప్రముఖ సినీకవి. ఇక అమ్మ అంటే చిరుకి ఉన్న ప్రేమాభిమానాలు గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు.
ప్రతిసారి తన తల్లి అంజనమ్మ బర్త్ డే రోజును మెగాస్టార్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి కూడా అమ్మ పుట్టినరోజును చిరు ఎంతో ఉల్లాసభరితంగా జరుపుకున్నారు అనడానికి ఇవిగో ఈ ఫోటోనే సాక్ష్యం. తన తల్లితో కలిసి సెల్ఫీ దిగారు చిరంజీవి. ఆ సెల్ఫీ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ అవుతోంది. చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులు ఈ బర్త్ డే వేడుకను కేక్ కటింగ్ కార్యక్రమంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో మెగా ప్రిన్సెస్ నీహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే గాక.. నాయనమ్మ అంజనమ్మకు ఇచ్చిన ఆ ప్రేమ పూర్వకమైన ముద్దుకు సంబంధించిన ఫోటో అంతే వైరల్ అయిపోతోంది.
అంజనమ్మ బర్త్ డే వేడుకల్లో చిరంజీవి భార్య సురేఖ కొణిదెల.. సోదరీమణులు.. సుష్మిత -నిహారికా తదితరులు పాల్గొన్నారు. టోటల్ ఫోటోల్లో చిరంజీవి తన తల్లి తో సెల్ఫీ క్లిక్ ఇవ్వడం అదిరిపోయిందన్న ప్రశంస దక్కింది. ఇక అంజనమ్మ తన చేతులకు తెల్లని పట్టీలతో కనిపించడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేసింది. తనకు ఏదో సెలెయిన్ ఎక్కించారా.. లేక సూది మందు వేశారా.. అన్నది ఆందోళన కలిగించింది. చిరు తదుపరి కెరీర్ 152వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.