Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ తో చిట్ చాట్.. సమాధానాలతో మహేష్ సర్ ప్రైజ

By:  Tupaki Desk   |   11 May 2022 7:30 AM GMT
ఫ్యాన్స్ తో చిట్ చాట్.. సమాధానాలతో మహేష్  సర్ ప్రైజ
X
సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ లో మహేష్ బాబు చాలా యాక్టివ్‌ గా పాల్గొంటున్నాడు. చివరి వారం రోజుల పాటు పూర్తిగా సమయం కేటాయించి సర్కారు వారి పాట ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు. రేపు విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమా గురించి ఎన్నో విషయాలను వెళ్లడించడంతో పాటు... ఆ సినిమా ప్రమోషన్ సమయంలో మరెన్నో వ్యక్తిగత విషయాలను మరియు కొన్ని ఆసక్తికర విషయాలను కూడా తెలియజేశాడు.

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో అభిమానులు.. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సెలబ్రెటీలు సమాధానం చెప్పడం చాలా కామన్ అయ్యింది. తద్వారా జనాలకు మరింత దగ్గర అయ్యి తమ సినిమాను ఎక్కువ ప్రమోట్‌ చేసుకునే అవకాశం దక్కుతుంది. అందుకే మహేష్ బాబు కూడా ఇన్ స్టా గ్రామ్‌ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఆస్క్ మీ ఎనీ థింగ్‌ సెషన్‌ ను నిర్వహించారు.

ఇందులో భాగంగా చాలా ప్రశ్నలు వచ్చాయి... అందులో కొన్ని ప్రశ్నలకు మహేష్ బాబు సమాధానం చెప్పాడు. అందులో కొన్ని స్పెషల్‌ గా నిలిచాయి. అవి కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా లో మీరు ఎప్పటికి గుర్తుంచుకునే విషయం ఏంటీ?
సినిమాలోని క్యారెక్టరైజేషన్. నా పాత్ర క్యారెక్టరైజేషన్ నాకు ఎప్పటికి గుర్తుండి పోయే విధంగా ఉంది.. మీకు కూడా ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ గుర్తుండి పోతుంది.

మనీ హైస్ట్‌ వెబ్‌ సిరీస్ లో మీరు ఏ పాత్రను పిక్‌ చేసుకుంటారు?
ప్రొఫెసర్‌

భవిష్యత్తులో మీ నుండి లేదా టాలీవుడ్‌ నుండి సూపర్‌ హీరో సినిమాలను ఆశించవచ్చా?
ఎలాంటి ఆలోచన లేదు.

పెన్నీ సాంగ్ లో సితార కనిపించింది కదా.. భవిష్యత్తులో తాను నటి అయ్యే అవకాశాలు ఉన్నాయా?
సితార ఇప్పటికే నటి.

మీరు ఎలా కామ్‌ అండ్ కంపోస్డ్‌ గా ఉంటారు?
ఎందుకంటే నేను కామ్‌ అండ్ కంపోస్డ్‌

మీరు షూటింగ్‌ సమయంలో పరశురామ్ లో చూసిన సర్‌ ప్రైజింగ్‌ విషయం ఏంటీ?
అతడి యొక్క రైటింగ్‌

మీరు రోజులో ఫోన్ లో ఎన్ని గంటలు ఉంటారు
లేదు

నటన విషయంలో ఏ ఇతర స్టార్‌ తో అయిన స్వాప్ చేసుకోవాలనుకుంటే ఏ స్టార్‌ ను ఎంపిక చేసుకుంటారు?
ఎవరు లేరు.. ఎందుకంటే నేను మహేష్ బాబు గా ఉండాలనే ఇష్టపడుతాను.

మీ యొక్క పుట్ బాల్‌ ప్లేయర్‌
రొనాల్డో

మీరు ఎందుకు ఇంత క్యూట్‌ గా హ్యాండ్సమ్‌ గా ఉంటారు?
థ్యాంక్యూ

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?
నా భార్య

మీ ఫ్యామిలీలో స్మార్ట్‌ వ్యక్తి ఎవరు?
సితార

సర్కారు వారి పాట సినిమాలో మీ యొక్క ఫేవరేట్‌ డైలాగ్ ఏంటీ?
మెయింటెన్ చేయలేక దూల తీరుతోంది.

నమ్రత లో మీకు నచ్చే అంశం?
ప్రతి ఒక్కటి.