Begin typing your search above and press return to search.
రంగుల భామ మాటలు నమ్మొచ్చా?
By: Tupaki Desk | 10 Jan 2018 4:07 AM GMTహీరో హీరోయిన్లు కావాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు మొదట్లో మీడియా దృష్టిని.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి తెగ ఆరాట పడుతుంటారు. అందుకే తమకు ఫలానా పెద్ద హీరో అంటే ఇష్టమని.. ఫలానా సినిమా తెగ నచ్చేసిందని అడక్కపోయినా చెప్పేస్తుంటారు. ఇవి చాలామంది చెప్పే మాటలే అయినా లేటెస్ట్ గా వస్తున్న రంగులరాట్నం సినిమా హీరోయిన్ చిత్రా శుక్లా మాత్రం ఇలాంటి మాటల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేసింది.
సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడే అవకాశం రావడంతో మైకు ముందు రాజకీయ నాయకుడిలా బోలెడు కోతలు కోసేసింది. తాను రంగుల రాట్నం నిర్మాత.. హీరో నాగార్జునకు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. తనే కాదు.. తన ఫ్యామిలీ అంతా కూడా నాగార్జునకు వీరాభిమానులేనని చెప్పేసింది. అమ్మడు పుట్టి పెరిగింది మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో. సినిమా ఛాన్సుల కోసం ముంబయికి వచ్చి బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కొన్నాళ్లు పనిచేసింది. ఇన్నేళ్ల కాలంలో ఈ భామతోపాటు ఆమె ఫ్యామిలీ తెలుగు సినిమాలే చూసే అవకాశమే ఉండదు. అలాంటప్పుడు నాగ్ కు వీరాభిమానులవడం అనే మాటకే స్కోప్ లేదు.
చిత్రా శుక్లాకు టాలీవుడ్ లోఇది మొదటి సినిమాయేం కాదు. ఇంతకుముందు మా అబ్బాయి అనే ఓ మూవీలో నటించింది. అప్పట్లో నాగార్జున సంగతే ప్రస్తావించలేదు. ఇప్పుడు అదృష్టం బావుడటంతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆఫర్ తలుపు తట్టింది. దాంతో నోటికొచ్చిన మాటలన్నీ చెబుతూ అభిమానులను బుట్టలో పడేయాలని ట్రై చేస్తోంది. ఈ భామ తెలుగు నేర్చుకోవడం మొదలెడితే అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలనే పాత సామెత ముందుగా నేర్పించాలి. ఏమంటారు?