Begin typing your search above and press return to search.

ముఖ చిత్రంపై ముఖం వెలుగుతోందిగా

By:  Tupaki Desk   |   2 Jun 2016 5:30 PM GMT
ముఖ చిత్రంపై ముఖం వెలుగుతోందిగా
X
చిత్రాంగదా సింగ్ టాలీవుడ్ జనాలకు అంత ఫెమిలియర్ ఫేస్ కాకపోయినా.. గ్లామర్ ప్రియులకు మాత్రం బాగా కావాల్సిన మనిషే. మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఈ భామ.. మొదట్లో డిగ్నిటీ - డీసెన్సీ లాంటి పదాలను బాగానే వాడేది. మెల్లమెల్లగా ఇండస్ట్రీకి కావాల్సినది సోకులు - సొగుసులే తప్ప.. ఇలాంటి పద్ధతులు కాదని తెలుసుకున్నాక.. అమ్మడి కెరీర్ ఊపందుకుంది.

అలాగని ఓ తెగ సినిమాలేమీ చేసేయదు చిత్రాంగద. అడపాదడపా మెరుస్తూ ఉంటుందంతే. 2014లో భర్త జ్యోతి సింగ్ రాంధవ నుంచి అఫీషియల్ గా విడాకులు కూడా తీసేసుకుని 13 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పేసింది. అప్పటివరకూ సినిమాల్లో రోల్స్ మాత్రమే చేసినా.. అక్కడి నుంచి మాత్రం స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చేస్తోంది చిత్రాంగదా సింగ్. ఈ సుందరాంగి గ్లామర్ కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రిటీల్లో కూడా ఈ 40 ఏళ్ల సుందరికి ఫాలోయింగ్ బాగా ఎక్కువే.

ఎఫ్ హెచ్ఎం జూన్ ఎడిషన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చింది చిత్రాంగద. వైట్ కలర్ టైట్ ఔట్ ఫిట్స్ తో కస్సుమంటోంది ఈ ముదురు సుందరి. పైగా.. ఈమె ఫోటో, పేరు రాసి.. 'మేము ఇంకేమన్నా ఎక్కువగా చెప్పాలా?' అంటూ ఓ కొటేషన్ కూడా రాశారంటే.. ఈ వయ్యారి ఒంపులను ఏ రేంజ్ లో చూపించారో సింపుల్ గా తెలిసిపోతోంది కదూ. మొత్తానికి సీనియర్ సుందరాంగి.. 40ల్లో కూడా నాజూకుతనంతో నిగనిగలాడుతోంది.