Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఒక ప్లేట్ సక్సెస్ కావాలి
By: Tupaki Desk | 7 April 2019 7:10 AM GMTమెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా 'చిత్రలహరి' టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో సాయి తేజ్ పోషించిన విజయ్ పాత్రను చూస్తే విజయం ఆమడ దూరం పారిపోతుంది. మరి రియల్ లైఫ్ లో సాయి తేజ్ పరిస్థితి అలానే ఉంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ కావడానికి ఆ సహజత్వం కూడా ఒక కారణం. ఇక ట్రైలర్ లో విజయ్ 'ఫెయిల్యూర్' తో పడే కష్టాలను.. ఎంత నార్మల్ గా ఉందామనుకున్నా ఉండనివ్వకుండా లోపలనుంచి ఎగదన్నుకుని వచ్చే ఫ్రస్ట్రేషన్ ను కాస్త వివరంగా చూపించారు.
ట్రైలర్ మొదట్లోనే "నా పేరు విజయ్. నా పేరులో ఉన్న విజయం నా లైఫ్ లో కి ఎప్పుడొస్తుందా అని అయామ్ వెయిటింగ్" అంటూ ఇంట్రో ఇచ్చుకున్నాడు సాయి తేజ్. కాకపోతే ఎంత ఏలినాటి శని జరుగుతున్నా కొంత మంచి జరుగుతుంది అన్నట్టుగా సాయి తేజ్ లో ఒకే పాజిటివ్ ఉందట. అదే తన జీవితంలోకి వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్. మరి ఏమయ్యిందో ఏమోకానీ ఆ లవ్వు కూడా ఫట్టే. "ఎంత ఆలోచించినా నువ్వు నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది విజయ్" అంటూ హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఎదురుగా ఉన్న విజయ్ కి షాక్ ఇస్తుంది. ఫైనల్ బిల్లుకు గట్టిగా జీఎస్టీ యాడ్ చేసినట్టుగా మరో హీరోయిన్ నివేద పేతురాజ్ "నీ మొహన్ని నా లైఫ్ లో చూడదలచుకోవడం లేదు" అంటూ రెండో స్ట్రోక్ ఇస్తుంది.
ఈ హీరోయిన్ల బాధలకు తోడు సక్సెస్ గురించి కనపడినవాళ్ళు కనపడినట్టు సాయి తేజ్ పై పంచ్ డైలాగ్ లు వేస్తూ సలహాలిస్తూ విజయ్ ను మరింతగా వేదనకు గురి చేస్తుంటారు. ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయిన అయిన సాయి తేజ్ "ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కుల ఉదయించినా.. ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే..చీకటికి చిరునామా నేను" అంటాడు. అదేంటో గానీ ఫ్రస్ట్రేషన్ లోనే ఫన్ ఎక్కువగా ఉంటుందట.. అసలే సక్సెస్ లేదనే బాధలో పెగ్గేద్ధామని బారుకు పోతే అక్కడ కుర్రాడు "ఏదో ఒక ఆర్డర్ చెప్పు అన్నా" అంటూ సతాయిస్తుంటాడు. ఇక భరించలేక "ఒక ప్లేట్ సక్సెస్" అంటాడు సాయి తేజ్. ఇది వరస. మరి ఈ కష్టాలకు దర్శకుడు శాశ్వత పరిష్కారం చూపించాడా లేదా.. అసలు విజయ్ జీవితంలోకి విజయం వచ్చిందా లేదా అనేది మిగతా కథ.
ఓవరాల్ గా యూత్ కు కనెక్ట్ అయ్యే స్టొరీనే. మన సమాజంలో దాదాపు మెజారిటీ కుర్రాళ్ళ పరిస్థితే ఇది. కాబట్టి సాయి తేజ్ కష్టాలతో తమను తాము చిటికెలో ఐడెంటిఫై చేసుకుంటారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా ఫ్లేవర్ కు సరిపోయింది. కిషోర్ తిరుమల మరోసారి మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి .