Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడు లంగా పైకెత్తమన్నాడట
By: Tupaki Desk | 13 Oct 2018 8:00 PM GMTబాలీవుడ్ హాట్ హీరోయిన్ చిత్రాంగద సింగ్.. ·రెండేళ్ల కిందట నవాజుద్దీన్ సిద్దిఖి హీరోగా తెరకెక్కిన ‘బాబూ మషాయ్ బందూక్ బాజ్’ సినిమా నుంచి అర్ధంతరంగా తప్పుకోవడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఒక సన్నివేశంలో అసభ్యంగా నటించమన్నందుకు నొచ్చుకుని చిత్రాంగద ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తున్న సమయంలో చిత్రాంగద నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంది. నానా పటేకర్ మీద ఆరోపణలు చేసిన తనూశ్రీకి మద్దతుగా నిలిచిన చిత్రాంగద.. తనకు ‘బాబూ మషాయ్..’ షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది.
‘‘ఆ సినిమా కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీతో మంచంపై ఓ సీన్ చేయాల్సి వచ్చింది. నాకు బటన్స్ లేని జాకెట్ తొడిగించి.. కేవలం లంగాపై ఉంచారు. ఆ సినిమాలో ముందు చెప్పని సన్నివేశాన్ని హడావిడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పుడు దర్శకుడు కుషాన్ నంది నా దగ్గరికి వచ్చి.. లంగా పైకి ఎత్తి కాళ్లు వెడల్పుగా చాపి నవాజుద్దీన్‌పై పడుకో అని చెప్పాడు. నేను అభ్యంతరం చెబుతున్నా నా మాటలు పట్టించుకోలేదు. దారుణంగా ప్రవర్తించాడు. అతనలా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ ఏం మాట్లాడకుండా చూస్తుండిపోయాడు. అంతేకాక సినిమా ప్రమోషన్ టైంలో మాట్లాడుతూ.. ఒక సీన్లో తాను రెండుసార్లు మజా చేశాను అని చెప్పుకున్నాడు. అసభ్యకరమైన సీన్లు నచ్చకపోవడంతోనే నేనా సినిమా నుంచి తప్పుకొన్నాను’’ అని చిత్రాంగద వెల్లడించింది. ఐతే దర్శకుడు కుషాన్.. చిత్రాంగద ఆరోపణల్ని ఖండించాడు. చిత్రాంగద సరిగా నటించకపోవడం వల్లే ఆమెను తప్పుకోమని చెప్పామన్నాడు.