Begin typing your search above and press return to search.
చిత్రపురిలో అపోలో హాస్పిటల్: మెగాస్టార్
By: Tupaki Desk | 18 Jan 2021 12:30 PM GMTచిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు ఈరోజు సోమవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి వారిని అభినందించి చిత్రపురి కాలనీ అభివృద్ధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సినీ ఇండస్ట్రీ తరుపున కొత్తగా ఎంపికైన కమిటీకి తన మద్దతు ఉంటుందని.. చిత్ర కాలనీ సమస్యలు ఏవైనా ఉంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి హామీ ఇచ్చారని తెలుస్తోంది.
అంతేకాకుండా తన కోడలు ఉపాసనతో మాట్లాడి చిత్రపురి కాలనీలో అపోలో హాస్పిటల్ నిర్మాణానికి సహకారం అందిస్తానని.. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని రావాలని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. అలానే సందర్భం వచ్చినప్పుడు చిత్రపురి కాలనీని సందర్శిస్తానని చిరు వారితో తెలిపారు. చిరంజీవితో సుమారు ముప్పై నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్ లో చిత్రపురి కాలనీ సెక్రటరీ కాదంబరి కిరణ్ - ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ - వినోద్ బాలా - దీప్తి వాజ్ పేయి - అనిత నిమ్మగడ్డ - లలిత - రామకృష్ణ ప్రసాద్ - అళహరి ఉన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవికి చిత్రపురి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.