Begin typing your search above and press return to search.
గుండెపోటుతో కాదు..ఆ రాతలకి ఐసీయూలో చేరాలి! విక్రమ్
By: Tupaki Desk | 29 Aug 2022 5:15 AM GMTకొన్ని వారాల క్రితం చియాన్ విక్రమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. ఐసీయూలో చేర్చారని సోషల్ మీడియా అంతటా పుకార్లు దావానాలా వ్యాపించాయి. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫేక్ ఫోటోలు సైతం నెట్టింట సంచలనం సృష్టించాయి.
అన్ని మీడియా సంస్థల్లోనూ విక్రమ్ అనారోగ్యంపై పెద్ద ఎత్తన చర్చ సైతం జరిగింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళను గురయ్యారు. తమ అభిమాన స్టార్ ఆరోగ్యంగా తిరిగి రావాలని..వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు..పూజలు సైతం చేసారు. అయితే అవన్నీ తప్పుడు కథనాలని విక్రమ్ కొంతసేపటి లైన్ లోకి వచ్చి ఆ వార్తల్ని ఖండించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎవరి ఇష్టానుసారం వారు మీమ్స్ చేసి ట్రోల్ చేసారు. తాజాగా 'కోబ్రా' ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న విక్రమ్ వీటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆ మీమ్స్ పుకార్లు తనను బాగా ప్రభావితం చేశాయన్నారు.అలాంటి థంబ్‌నెయిల్స్.. దండతో ఉన్న చిత్రాలను చూసినప్పుడు అవాక్కయ్యానని చెప్పా రు.
ఎన్టీఆర్ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆయనకు సానుభూతి తెలుపుతున్నట్లు ఒక వార్త చూసి షాక్ అయ్యానన్నారు. ఇంత దారుణమైన ట్రోలింగ్ లకు పాల్పడతారా? అని నవ్వేసారు. '' జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఇంత సీన్ చేసారు.
ఇలాంటి ఫేక్ ఊహాగానాలు అక్షరాలతో కచ్చితంగా గుండె పోటు వస్తుంది. వీటి కారణంగా కొన్ని రోజుల పాటు ఐసీయూలో చేరాలేమో'' '' అని విక్రమ్ చమత్కరించారు.
విక్రమ్ ఆరోగ్యంపై వచ్చిన అనైతిక వార్తలతో తీవ్ర కలత చెందినట్లు తెలుస్తోంది. మీడియా ముందు నవ్వుతూ తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు. 'సీబీఐ అంజలి' ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన కోబ్రా ఆగస్ట్ 31న తమిళం తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్రలో నటించారు. తెలుగు వెర్షన్ కోబ్రాను ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.