Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌‌: అగ్ర రాజ్యానికి కోబ్రా టెన్ష‌న్స్

By:  Tupaki Desk   |   2 Dec 2020 10:30 AM GMT
ట్రెండీ టాక్‌‌: అగ్ర రాజ్యానికి కోబ్రా టెన్ష‌న్స్
X
కోవిడ్ మ‌హ‌మ్మారీ విల‌యం షూటింగుల‌కు బిగ్ బ్రేక్ వేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికా.. ర‌ష్యా సహా యూరోప్ లో షూటింగుల‌న్నిటికీ చెక్ పెట్టేసింది. విదేశాల నుంచి చిత్ర‌బృందాల‌న్నీ ఇండియాకి తిరిగి వ‌చ్చేశాయి. ఈ కోవ‌లోనే చియాన్ విక్ర‌మ్ కోబ్రా టీమ్ ర‌ష్యా నుంచి వెన‌క్కి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏడెనిమిది నెల‌లుగా ప్ర‌హ‌స‌నం తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ దేశాలు అల్ల‌క‌ల్లోలం అయ్యాయి. లాక్ డౌన్ ప్ర‌పంచ యుద్ధాన్ని త‌ల‌పించింది.

ఏదేమైనా ఇప్ప‌టికి కాస్తంత కోలుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. సెకండ్ వేవ్ అని భ‌య‌పెడుతున్నా ఎవ‌రూ భ‌య‌ప‌డ‌కుండా షూటింగులు స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు విక్ర‌మ్ టీమ్ కూడా ర‌ష్యాకు వెళ్లేందుకు స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉంది. అంటే ర‌ష్యాకు కోవిడ్ టెన్ష‌న్ తో పాటు కోబ్రా టెన్ష‌న్ త‌ప్ప‌దా అంటూ యూత్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తోంది.

నిజానికి మహమ్మారి ప్రపంచాన్ని అట్టుడికిన్నప్పుడు రష్యాలో కోబ్రా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. కానీ వైర‌స్ వ‌ల్ల స‌డెన్ బ్రేక్ ప‌డింది. అజయ్ జ్ఞానముతు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కోబ్రా లుక్ ఇప్ప‌టికే సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ లోనూ దీని గురించి చ‌ర్చ సాగింది. ఇక ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తున్నారు. చెన్నైలో ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ప్రారంభమైందని ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత రష్యా షెడ్యూల్ ప్రారంభిస్తార‌ని చెబుతున్నారు.

చియాన్ విక్రమ్ స‌ర‌స‌న‌ కెజిఎఫ్ నటి శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. కెఎస్ రవికుమార్ తదితరులు కీల‌క‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. చియాన్ పై మొదటి పాటను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. తుంబి తుల్లాల్ పేరుతో రొమాంటిక్ నంబర్ ను ఎఆర్ రెహమాన్ స్వరపరిచారు. అలాగే ఇర్ఫాన్ ఖాన్ లుక్ కూడా ఇదివ‌ర‌కూ రిలీజైంది. అలాగే లాక్ డౌన్ న‌ష్టాల్ని దృష్టిలో ఉంచుకుని విక్ర‌మ్ స‌హా ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు పారితోషికం త‌గ్గించుకున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది.

చియాన్ ఇత‌ర కెరీర్ సంగ‌తి చూస్తే.. కోబ్రా కాకుండా మణిరత్నం పొన్నీయిన్ సెల్వన్ లో కూడా కనిపించ‌నున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ చోళ రాజు ఆదిత్య కరికాలన్ పాత్రలో కనిపిస్తాడని ఊహాగానాలు సాగుతున్నాయి.