Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు మిస్ అయిన రికార్డ్ చియాన్ విక్రమ్ కు..!
By: Tupaki Desk | 10 July 2022 7:11 AM GMTఈమద్య కాలంలో సౌత్ ఇండియన్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అయితే మొత్తం హీరోలు అంతా కూడా తమ సొంత భాషలో తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు కాని ఇతర భాషల్లో మాత్రం డబ్బింగ్ చెప్పేందుకు సాహసించడం లేదు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కు అన్ని భాషల్లో కూడా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో డబ్బింగ్ చెప్పించాలని భావించాడు.
తెలుగు తో పాటు తమిళం మరియు కన్నడంలో పర్వాలేదు కాని మలయాళం కు వచ్చేప్పటికి కష్టం గా మారింది. దాంతో రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకుని హీరోలను ఎక్కువగా కష్టపెట్టకుండా డబ్బింగ్ ను వేరే వాళ్లతో చెప్పించాడు. ఎన్టీఆర్ అన్ని భాషలకు డబ్బింగ్ చెప్పబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కాని అది కూడా సాధ్యం కాలేదు. కాని ఎన్టీఆర్ సాధించలేని రికార్డ్ ఇప్పుడు చియాన్ విక్రమ్ అందుకోబోతున్నాడు.
చియాన్ విక్రమ్ తాజా చిత్రం 'కోబ్రా' పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తమిళంతో పాటు గతంలో పలు భాషల్లో విక్రమ్ సినిమాలు విడుదల అయిన దాఖలాలు ఉన్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. కోబ్రా సినిమా అంతకు మించి అన్నట్లుగా విడుదల కాబోతుంది. తెలుగు లోనే భారీ ఎత్తున కోబ్రా ను విడుదల చేయబోతున్నారు.
విడుదల అవ్వబోతున్న అయిదు భాషల్లో కూడా కోబ్రా కు తన గొంతును విక్రమ్ ఇవ్వబోతున్నాడట. గత రెండు సంవత్సరాలుగా విక్రమ్ అభిమానులను ఊరిస్తున్న కోబ్రా సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలో విక్రమ్ గుండె పోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయన ఆరోగ్యం బాగుందని.. ఎలాంటి ఆందోళన లేదని వైద్యులు ప్రకటించారు.
విక్రమ్ కు సంబంధించిన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. కోబ్రా సినిమా ను ఆయన అభిమానులు ఖచ్చితంగా ఆధరిస్తారని అంటున్నారు. సొంతంగా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలని భావించాడని.. ఆ విషయంలో వెనక్కు తగ్గే ఆలోచన అస్సలు లేదని కోబ్రా యూనిట్ సభ్యులు అంటున్నారు. అలాగే సినిమా విడుదల తేదీ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండబోదు అన్నట్లుగా స్పష్టం చేస్తున్నారు.