Begin typing your search above and press return to search.
పొన్నియిన్ సెల్వన్ - 1: బెదరని పెద్దపులి ఛోళా చోళా..
By: Tupaki Desk | 19 Aug 2022 3:23 PM GMTదక్షిణాది నుంచి వస్తున్న మరో భారీ చారిత్రాత్మక మూవీ `పొన్నియిన్ సెల్వన్`. ఏస్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ పీరియాడిక్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
1955లో ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి పాపులర్ నవల `పొన్నియిన్ సెల్వన్` ఆధారంగా ఈ మూవీని `బాహుబలి`, కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ముందు ఫస్ట్ పార్ట్ `పొన్నియిన్ సెల్వన్ 1` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాళుడిగా నటిస్తుండగా కార్తి అతని సామంత రాజువల్లవరాయన్ వంధ్యదేవన్ గా కనిపించబోతున్నారు.
ఇప్పటికే పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ లని విడుదల చేసిన మేకర్స్ తాజాగా లిరికల్ వీడియోలని విడుదల చేస్తూ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. సెప్టెంబర్ 30 న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఇటీవల కార్తీపై చిత్రీకరించిన ఫస్ట్ సింగిల్ `పొంగే నది..` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. తాజాగా విక్రమ్ పై చిత్రీకరించిన `చోళ చోళ .. అంటూ సాగే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని శుక్రవారం విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. మనో , అనురాగ్ కులకర్ణి ఆలపించారు. `గల గల కడవరకు...ఎగురుతది రెప రెప మనుచూ.. ఎరుపు జెండా పద పద నిలబడకు... సమరమంటే బడబడిబడి మనకు..శత్రువులకు పాఠం చెప్పాలోయ్...
పోరాడు పోరాడు పులి పులి జెండా.. చోళా రాజ్యమే.. పెద పెద పులి ఎచ్చోటరా.. కూర్చోదురా.. చోళా చోళా.. బెరని పులి నెగ్గేసినా..తగ్గెయ్ దురా.. అంటూ ఆదిత్ కరికాళుడు వీర పరాక్రమాలని కీర్తిస్తూ సాగే ఈ పాటు ఆకట్టుకుంటోంది. పదవ శతాబ్దానికి చెందిన సాహసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల ఆధారంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తూ దీన్ని సెట్స్ పైకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేశారు మణరత్నం.
ఎట్టకేలకు లైకా వారు తోడవ్వడంతో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలన్న తన చిరకాల స్వప్నాన్ని ఇప్పటికి నెరవేర్చుకుంటున్నారు. `బాహుబలి`, కేజీఎఫ్, RRR వంటి భారీ చిత్రాల తరువాత దక్షిణాది నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, సినిమాటోగ్రఫీ రవివర్మన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్.