Begin typing your search above and press return to search.
చూశా చూశా అంటూ చాలా చూపించిన చెర్రీ!!
By: Tupaki Desk | 11 Nov 2016 3:59 PM GMTరామ్ చరణ్ మూవీ ధృవ సందడి ఆడియన్స్ లో ఎక్కువయిపోతుంది. రిలీజ్ అనుకున్న తేదీకి నెల రోజుల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేయడం.. పది సెకన్ల నిడివితో సాంగ్ ప్రోమోస్ రిలీజ్ చేయడం.. ఆడియో ఫంక్షన్ చేయకపోయినా టీవీల్లో యాడ్స్ స్టార్ట్ చేసేయడంతో పాటు.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాటలు శ్రోతలను కట్టిపడేస్తున్నాయి.
ఇప్పుడు మేకింగ్ వీడియోల హంగామా కూడా స్టార్ట్ చేసేశాడు మెగాపవర్ స్టార్. కశ్మీర్ లో షూటింగ్ చేసిన చూశా చూశా సాంగ్ కు మేకింగ్ విడుదల చేసింది ధృవ యూనిట్. అక్కడి అందమైన లొకేషన్స్.. కళ్లు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాలతో పాటు.. వాటి మధ్యలో ధృవ యూనిట్ చేస్తున్న హంగామా చూపించారు. మరోవైపు.. రామ్ చరణ్.. రకుల్ ప్రీత్ లు షూటింగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదనే విషయం అర్ధమవుతోంది.
ఇక కశ్మీర్ షెడ్యూల్ మొత్తం చెర్రీ మామయ్య.. ధృవ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ దగ్గరుండి ప్రొడక్షన్ చూసుకుంటున్న విషయం కూడా చూడచ్చు. అన్నిటికీ మించి.. షూటింగ్ ఆసాంతం.. అక్కడి చిన్నారులకు చెర్రీ పంచుతున్న చాక్లెట్లు.. అవి ఇస్తూ ఆడుతున్న ఆటలు చూస్తుంటే.. పిల్లలంటే ఈ మెగా హీరోకి ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. మొత్తానికి కాశ్మీర్ టూర్ ని చెర్రీ అండ్ టీం బాగానే ఎంజాయ్ చేసినట్లున్నారులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/