Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ 'ఇండియ‌న్ 2' కు RRR ఫీవ‌ర్‌!

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 AM GMT
క‌మ‌ల్ ఇండియ‌న్ 2 కు RRR ఫీవ‌ర్‌!
X
క‌మ‌ల్ 'ఇండియ‌న్ 2' కు RRR ఫీవ‌ర్ ప‌ట్టుకుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే... నాలుగేళ్ల విరామం అనంత‌రం యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిపిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ క‌మ‌ల్ కెరీర్ ని మ‌ళ్లీ గాడిలో ప‌డేలా చేసింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ లో వున్న క‌మ‌ల్ హాస‌న్ ఈ మూవీని త‌మిళ‌నాట రిలీజ్ చేసిన యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ని రంగంలోకి దించేసి 'ఇండియ‌న్ 2'ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించాడు.

క్రేన్ ప్ర‌మాదం కార‌ణంగా మేక‌ర్స్ కి, డైరెక్ట‌ర్ శంక‌ర్ కి మ‌ధ్య త‌లెత్తిన వివాదం కార‌ణంగా 'ఇండియ‌న్ 2' గ‌త కొంత కాలంగా ఆగిపోయిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ చొర‌వ‌తో మొద‌లైన ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం నిర‌వ‌ధికంగా జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ లో చెన్నైలో కీల‌క ఘట్టాల‌ని చిత్రీక‌రించారు. దీంతో షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్ ని తిరుప‌తిలో మొద‌లు పెట్టారు. అక్క‌డే లీడింగ్ యాక్ట‌ర్స్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

ఈ మూవీ షూటింగ్ ని ఏప్రిల్ వ‌ర‌కు పూర్తి చేయాల‌ని చిత్ర బృందం, శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని ఆ వెంట‌నే మొద‌లు పెట్టి అక్టోబ‌ర్ లో భారీ స్థాయిలో ఈ మూవీని పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ కోసం శంక‌ర్ 'RRR' డ్యాన్స్ మాస్ట‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ ని రంగంలోకి దించేశార‌ట‌. ప్రేమ్ ర‌క్షిత్ 'RRR' మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ పాట‌కు గానూ ఓరిజిన‌ల్ సాంగ్ విభాగంలో కీర‌వాణికి ప్ర‌ఖ్యాత‌ గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం ల‌భించడం తెలిసిందే. త్వ‌ర‌లో లాస్ ఏంజీల్స్ లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అవార్డుల్లోనూ ఈ సాంగ్ కార‌ణంగా 'RRR' నామినేష‌న్స్ ని సాధించ‌డంతో అంద‌రి దృష్టి ప్రేమ్ ర‌క్షిత్ పై ప‌డింది. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ దృష్టి కూడా ప్రేమ్ ర‌క్షిత్ పై ప‌డ‌టంతో అత‌న‌నితో 'ఇండియ‌న్ 2' కోసం ఓ పాట‌కు ప్రేమ్ ర‌క్షిత్ చేత కొరియోగ్ర‌ఫీ చేయిస్తున్నార‌ట‌.

క‌మ‌ల్ హాస‌న్ పై ఈ పాట‌ని చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. త‌న ప్ర‌తీ సినిమాలోనూ పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఇస్తూ వ‌స్తున్న శంక‌ర్ 'ఇండియ‌న్ 2' కోసం కూడా అదే స్థాయిలో పాట‌ల కోసం ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లు గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల‌లో సిద్ధార్ధ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీసింహా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.