Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ ఒక _____ డైరక్టర్

By:  Tupaki Desk   |   28 Jun 2017 9:31 AM GMT
కృష్ణవంశీ ఒక _____ డైరక్టర్
X
ఆ ఖాళీని మీరే పూరించుకోండి అంటే.. కొందరు ఒక 'క్రియేటివ్' అని కొందరు ఇంకోటేదో అని పూరిస్తారు. కాని ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్ మాత్రం.. ఒక బూతుతోనే పూరిస్తున్నాడు. అదే కరక్ట్ అంటున్నాడు కూడా. అందుకే కృష్ణవంశీ సినిమాలు ఇప్పుడు ఫ్లాపులు అవుతున్నాయి అంటూ నానా రభస చేసిపాడేశాడు. యుట్యూబ్ కోసం ఇంటర్యూ చేసే ఒక కెమెరా దొరకడంతో.. కాస్త సీనియర్.. 1990లలో మద్రాసులో బిజీ అయిన రామారావు ఎలియాస్ రాకేష్‌ మాష్టార్ ఏమంటున్నాడో చూడండి. ఇతడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాష్టర్ గురువు అని ఆయనే చెబుతున్నాడు.

అప్పట్లో 'చక్రం' సినిమా కోసం జగమంత కుటుంబం నాది అనే సినిమాను కొరియోగ్రాఫ్‌ చేయడానికి ఇతడిని పిలిచాడట వంశీ. ఏకంగా 11 రోజులపాటు ఆ పాట షూటింగ్ జరిగినా కూడా.. ఎందుకో ఇతగాడితో అస్సలు పనే చేయించుకోలేదట వంశీ. ఇదే విషయం ప్రస్తావిస్తూ.. ''కృష్ణవంశీ ప్రక్కనే ఎప్పుడూ జోగి బ్రదర్స్ ఇద్దరు బఫూన్స్ లా ఉంటారు. వీళ్లను చూసుకుని ఆయన సిగరెట్ కాలుస్తూ.. ఏయ్ ఇలా రా అని పిలిచేవాడు. పక్కనే ఉండి ఏం చేస్తున్నానో చూడు అనేవాడు. అసలు మనకు వర్క్ లేనప్పుడు పక్కన కూర్చోకపోతే ఆయన పక్కనుండి భజన చేయాలా?'' అంటున్నాడు రాకేష్‌ మాష్టార్.

''అంతా ఆయనే క్రియేటివ్ డైరక్టర్. అన్నీ ఆయనే చేసుకుంటాడు. కృష్ణవంశీ బొంగూ బొషాణం ఏం లేదు. ఇండస్ర్టీ ఎవరి సొంతం కాదు'' అంటూ ఘాటుగా చెప్పేశాడు. ''11 రోజుల సాంగులో నేను చేసిందేం లేదు. అంతా ఆయనే. మళ్ళీ రీషూట్స్ అంటాడు. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. పెద్ద పెద్ద డైరక్టర్లు మాకు అవకాశం ఇచ్చారు కాని.. కృష్ణవంశీ మాత్రం భోజనం ప్లేట్ లో పెట్టినట్లే పెట్టి.. తన్నేస్తాడు. ఆయన ఎంత పెద్ద డైరక్టర్ అయినా అవ్వొచ్చు.. వ్యక్తిగతంగా నా దృష్టిలో కృష్ణవంశీ పెద్ద వెధవ'' అంటూ ముగించాడు. ఇది నా ఆవేదన అంటూ.. కృష్ణవంశీ టెక్నీషియన్లను అవమానించి కంట తడిపెట్టించి ఒళ్ళంతా చమట్లు పట్టించాడు.. అందుకే ఇప్పుడు అలా అయిపోయాడు అనేశాడు.

ఇంతకముందు ఏదన్నా చెప్పాలంటే టివి ఛానళ్ళకు వెళ్ళాల్సివచ్చేదని.. ఇప్పుడు యుట్యూబ్ లో ఆవేదన చెప్పుకోవడానికి స్వేచ్ఛ దొరికిందని కామెంట్ చేశాడు రాకేష్‌ మాష్టర్. ఆ వీడియో చూస్తూ అతను ఏ టోన్లో కామెంట్ చేశాడో మీకే అర్ధమవుతుంది.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/