Begin typing your search above and press return to search.
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇక లేరు
By: Tupaki Desk | 3 July 2020 3:30 AM GMTబాలీవుడ్ లో వరుస విషాదాలు ఊపిరి సలపనివ్వడం లేదు. రిషీకపూర్.. ఇర్ఫాన్ ఖాన్.. సుశాంత్ సింగ్ సహా పలువురి మరణాలు తీవ్రంగా కలచి వేశాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యల తో ముంబై బాంద్రా లోని గురునానక్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతం లో గుండె పోటు తో కన్ను మూశారు.
గత పది రోజులుగా ఆమెకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రస్తుత మహమ్మారీ సీజన్ ని దృష్టి లో ఉంచుకుని తనకు కొవిడ్ 19 టెస్టుల్ని నిర్వహించగా రిపోర్టుల్లో నెగెటివ్ అని వచ్చింది. సరోజ్ ఖాన్ వయసు 71 ఏళ్లు కావడంతో .. వయసు రీత్యా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇది వైద్య చికిత్సకు సహకరించని పరిస్థితి ఉంది. అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సరోజ్ తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు చెబుతున్నారు. సరోజ్ ఖాన్ భౌతికకాయాన్ని మలాద్ మిత్ చౌకీకి తరలించారు.
సరోజ్ కెరీర్ సంగతిని పరిశీలిస్తే.. 1975లో మౌసమ్ సినిమాతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయ్యారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు బాలీవుడ్ సహా పలు పరిశ్రమలకు కొరియోగ్రాఫర్ గా తన సేవలందించారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. డోలా రె డోలా (దేవ్‌దాస్).. ఏ ఇష్క్ హాయే (జబ్ వి మెట్).. మణికర్ణిక.. తను వెడ్స్ మను రిటర్న్స్ సహా పలు బ్లాక్ బస్టర్లకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. సరోజ్ ఖాన్ కి తెలుగు సినీపరిశ్రమలోనూ వీరాభిమానులున్నారు. ఆమె పలు తెలుగు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు.