Begin typing your search above and press return to search.

జూనియర్ తర్వాత సింగల్ టేక్ ఆర్టిస్ట్ తనేనట!

By:  Tupaki Desk   |   3 Dec 2018 12:50 PM IST
జూనియర్ తర్వాత సింగల్ టేక్ ఆర్టిస్ట్ తనేనట!
X
ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ కెమెరా మెన్లలో చోటా కె నాయుడుది ప్రత్యేక స్థానం. అగ్ర హీరోలు మొదలుకుని చిన్న రేంజ్ దాకా అందరితో చేసిన అనుభవం ఆయన సొంతం. నిన్న కవచం ప్రీ రిలీజ్ లో పాల్గొన్న చోటా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. తారక్ లాగే సాయి శ్రీనివాస్ కూడా సింగల్ టేక్ ఆర్టిస్ట్ అని ఏదైనా డైలాగ్ కానీ సన్నివేశం కానీ వెంటనే ఆకలింపు చేసుకుని అందులో పరకాయ ప్రవేశం చేస్తాడని తెగ పొగిడేసాడు.

సాధారణంగా ఇలాంటి వేడుకల్లో పొగడ్తలు కామనే కానీ అంత ఎక్స్ పీరియన్స్ ఉన్న తారక్ తో ఇంకా హిట్ కోసం ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్న సాయి శ్రీనివాస్ తో పోల్చడం ఏమిటి అని నోరు నొక్కుకున్న వాళ్ళు లేకపోలేదు. అయితే చోటా మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ మాటలు చెప్పడం చూసి హీరో ఆనందం ప్రత్యేకంగా చెప్పాలా. కవచం డిసెంబర్ 7 విడుదలకు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మొదలయ్యాయి. చోటా కె నాయుడు చెప్పిన సింగల్ టేక్ సీన్లు ఏంటో రిలీజయ్యాక తెలుస్తాయి కానీ ఇప్పటికైతే ఇది ఫాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.

సాక్ష్యం నిరాశ పరిచిన నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ఆశలన్నీ కవచం మీదే ఉన్నాయి. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడిగా పరిచయమవుతున్న కవచంలో కాజల్ అగర్వాల్ మెహ్రీన్ హీరోయిన్లు కావడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. సాహో విలన్ నీల్ నితీష్ మొదటి తెలుగు సినిమాగా కూడా కవచం ప్రత్యేకత సంతరించుకుంది. ఇది హిట్ అయితే కుర్రాడి కెరీర్ ట్రాక్ లో పడ్డట్టే.