Begin typing your search above and press return to search.
కామెంట్: రెహ్మాన్ స్టయిలే వేరబ్బా!!
By: Tupaki Desk | 20 Nov 2016 7:39 AM GMTకోల్డ్ ప్లే అనే బ్యాండ్ పేరు మీరు వినే ఉంటారు. ఈ రాక్ గ్రూపులో క్రిస్ మార్టిన్ అనే సింగర్ కమ్ మ్యూజిక్ ప్లేయర్ చాలా ఫేమస్. మనోడికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న గ్లోబల్ సిటిజన్ కాన్సర్టుకు క్రిస్ మార్టిన్ కూడా విచ్చేశాడు. కోల్డ్ ప్లే బ్యాండ్ ఇక్కడ పాల్గొని .. అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.
విషయం ఏంటంటే.. స్టేజీ మీదకు కోల్డ్ ప్లే బ్యాండుతో కలసి ఏ.ఆర్.రెహ్మాన్ కూడా విచ్చేశాడు. అంతేకాదు.. రెహ్మాన్ తన ఆర్కెస్ర్టాను పిలిచి వందేమాతరం సాంగ్ వాయించమన్నాడు. ''మా తుజే సలామ్'' అంటూ తను పాడటమే కాకుండా.. అంతే ఊపుతో క్రిస్ మార్టిన్ తో కూడా పాడించాడు. మన దేశం వచ్చినందుకు ముందుగా మన దేశాన్ని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే. అలాంటి గౌరవం అర్పించడానికి రెహ్మాన్ ద్వారా క్రిస్ మార్టిన్ ఈ పాటను పాడటం చాలామంది ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కు ఫుల్ కిక్కిస్తోంది.
గతంలో నోబెల్ బహుమతి కాన్సర్టులో భారతీయ క్లాసికల్ సంగీతాన్ని వాయించడం నుండి.. ఇప్పుడు 'కోల్డ్ ప్లే' క్రిస్ మార్టిన్ తో వందేమాతరం పాడించడం వరకు.. రెహ్మాన్ స్టయిలే వేరబ్బా అనుకోవాల్సిందే మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/