Begin typing your search above and press return to search.
ఆస్కార్ వేదికని నేర ప్రాంతంగా భావించిన క్రిస్ రాక్!
By: Tupaki Desk | 30 Aug 2022 2:30 PM GMTగతేడాది జరిగిన 94వ ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టి అవమానించిన సంగతి తెలిసిందే. మరి ఆ చెంపదెబ్బ 95వ ఆస్కార్ వేడుకలపై పడిందా? 2023 లో జరిగే వేడుకలకు క్రిస్ నిరాకనించాడా? అంటే అవుననే తెలుస్తోంది. అవును వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుకల్లో క్రిస్ కే ఆబాధ్యతలు అప్పగించాలని నిర్వాహకులు భావించారు.
కానీ క్రిస్ రాక్ ఆఫర్ ని నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అరిజోనాలోని ఓ కామెడీ సెట్ లో క్రిష్ ఆస్కార్ పై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు అరిజోనా రిపబ్లిక్ వెల్లడించింది. "మరోసారి ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం అంటే? నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లి వచ్చినట్లే ఉంటుందని క్రిష్ స్పందించినట్లు" తెలిపింది.
దీనిపై స్మిత్ సైతం స్పందించారు." ఆయన నా కంటే పెద్దవాడు. ఆ ప్రాంతం మరోసారి మా మధ్య ఈ తరహా పోరాటానికి అనుమతించదు' అన్నారు. ఈ ఘటన తర్వాత క్రిస్ రాక్ సూపర్ బాల్ యాడ్ ని కూడా తిరస్కరించారు.
ఆ చెంప దెబ్బని తీవ్ర అవమానంగా భావించి కొన్ని నెలలు పాటు అజ్ఞాతంలోనూ గడిపారు. ఇక స్మిత్ పై ఆస్కార్ అకాడమీ నిషేధం విధించింది. దీంతో స్మిత్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.
94వ ఆస్కార్ వేడుకల్లో హోస్ట్ చేసిన క్రిస్ రాక్ ని హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ వేదికపై చెంప చెళ్లు మనిపించిన ఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ పై జోకులేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంతతరం విల్ స్మిత్ వేదికపైనే క్రిస్ రాక్ కి...అకాడమీకి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ..మీమ్స్ ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.