Begin typing your search above and press return to search.
విదేశీయులతో కన్నీళ్లు పెట్టించిన మన సినిమా
By: Tupaki Desk | 21 Aug 2022 12:30 AM GMTసౌత్ ఇండియన్ సినిమాలు గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సందడి చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికల పై ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడుతూ గౌరవంను గుర్తింపును దక్కించుకుంటున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో నటించిన జై భీమ్ సినిమా బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.
బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి స్క్రీన్ లో జై భీమ్ ను ప్రదర్శించిన సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్క్రీనింగ్ కు హాజరు అయ్యారు. ఆ సమయంలో ప్రేక్షకులు కొందరు జై భీమ్ సినిమాలోని సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. సినిమా చాలా ఎమోషనల్ గా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా పూర్తి అయిన తర్వాత కూడా ఎమోషన్స్ గురించి.. సినిమా కథ మరియు నటి నటుల యొక్క నటన గురించి మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు.
జై భీమ్ థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా భారీ విజయాన్ని ఓటీటీ ద్వారా దక్కించుకుంది.
ఇప్పుడు వివిధ కేటగిరీల్లో అంతర్జాతీయ స్థాయి అవార్డులకు నామినేట్ అవుతూ ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ల్లో ప్రదర్శన అవుతోంది. సూర్య ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించాడు. దేశంలో ఇప్పటికి కొన్ని వర్గాల వారిని అత్యంత హీనంగా చూస్తూ కనీసం మర్యాద ఇవ్వకుండా వారికి న్యాయం జరగకుండా చూస్తున్నారు. వారికి సంబంధించిన కథతో రూపొందిన సినిమా జై భీమ్.

Audience Response for #JaiBhim after the Screening at Beijing International Film Festival@Suriya_offl