Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై అభిమానం..ఆయనకు చెప్పు అనుభవం!

By:  Tupaki Desk   |   27 Sep 2019 7:32 AM GMT
ప్రభాస్ పై అభిమానం..ఆయనకు చెప్పు అనుభవం!
X
టాలీవుడ్ లో ఇప్పటివరకూ ప్యాన్ ఇండియా స్టార్ లా గుర్తింపు సాధించిన ఒకే ఒక హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. డార్లింగ్ నటించిన 'సాహో' భారీ సక్సెస్ సాధించలేకపోయినా హిందీ బెల్ట్ లో మాత్రం హిట్ గా నిలిచి ప్రభాస్ క్రేజ్ ను మరోసారి అందరికీ చాటి చెప్పింది. సినిమాకు నెగెటివ్ టాక్.. మిక్స్డ్ రివ్యూస్ వస్తేనే అలాంటి స్పందన ఉందంటే.. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే భారీ బ్లాక్ బస్టర్ గా మారి ఉండేదనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ క్రేజ్ గురించి రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

'సాహో' లో సీనియర్ బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే విలన్ పాత్రలో నటించాడు. దేవరాజ్ అనే పాత్రలో నటించిన చుంకీ పాండేకి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. అయితే ఆయనకు ఒక ప్రభాస్ అభిమానితో చేదు అనుభవం ఎదురైందట. ఒక పెద్ద వయసు మహిళ చుంకీ పాండేకి నాలుగు తగిలించాలని చెప్పు పట్టుకొచ్చిందట. ఇంతకీ ఆమెకు ఎందుకు కోపం వచ్చిందంటే.. 'సాహో' లో ఒక సీన్ లో చుంకీ హీరో ప్రభాస్ ను చంపేందుకు ప్రయత్నిస్తూ మెడ ను విరుస్తాడు. అయితే హీరో కాబట్టి ప్రభాస్ ఏమీ కాకుండా తప్పించుకుంటాడు. కానీ ఆ ఓల్డ్ లేడీకి తన అభిమాన కథానాయకుడిని ఇలా చేయడం నచ్చలేదట. అందుకే చుంకీకి తనదైన శైలిలో బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది!

ఇక్కడ రెండు విషయాలు అర్థం అవుతాయి. ఒకటి ప్రభాస్ క్రేజ్.. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ను హిందీ ఆడియన్స్ తమ సొంత హీరోలా భావిస్తున్నారు. ఒక రెండోది.. చుంకీ ఆ సీన్ లో ఎంతగా జీవించకపోతే ఆ వృద్ధ మహిళకు అంత కోపం వస్తుంది చెప్పండి.. ఆ విలన్ ఎక్స్ ప్రెషన్లు సూపర్ గా పెట్టాడు కాబట్టి ఆ మహిళ కోపం నషాళానికి అంటింది.