Begin typing your search above and press return to search.
చుప్ ట్రైలర్ టాక్: క్రిటిక్స్ ని టార్గెట్ చేసే సైకో కిల్లర్!
By: Tupaki Desk | 5 Sep 2022 10:23 AM GMTచీనీకమ్, పా, ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్, ప్యాడ్ మెన్, మిషన్ మంగళ్ వంటి విభిన్నమైన సినిమాలతో బాలీవుడ్ లో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు ఆర్. బాల్కీ. 'మిషన్ మంగళ్' తరువాత ఆర్. బాల్కీ రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'చుప్ : రివేంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్'. దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరీ, సన్నీడియోల్ కీలక పాత్రల్లో నటించారు. దివంగత రాకేష్ ఝున్ ఝున్ వాలా తో కలిసి డా. జయంతీలాల్ గడ, అనిల్ నాయుడు, గౌరీ షిండే ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.
సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని సోమవారం విడుదల చేశారు. ట్రైలర్, టైటిల్ ని బట్టి క్రిటిక్స్ పై ప్రతీకారంతో రగిలిపోయే ఓ ఆర్టిస్ట్ సైకో కిల్లర్ గా మారి వరుసగా భయానకంగా హత్యలు చేస్తుండం కనిపిస్తోంది.
ట్రైలర్ లోనూ సినిమాలకు క్రిటిక్స్ ఇచ్చే స్టార్స్ ని టార్గెట్ గా పెట్టుకుని వరుసగా హత్యలు చేస్తున్న తీరు ట్రైలర్ లో కనిపిస్తోంది. సినిమాలకు వన్ స్టార్ వేసిన క్రిటిక్ ని హత్య చేసి నుదిటిపై వన్ స్టార్ వేయడం..
టు స్టార్స్ వేసిన క్రిటిక్ కి కత్తితో నుదిటిపై టు స్టార్స్ ఇవ్వడం అత్యంత కిరాతకంగా హత్య చేయడం ట్రైలర్ లో కనిపిస్తోంది. అయితే ఆ కిల్లర్ ఎవరు? .. ఎందుకు క్రిటిక్స్ నే టార్గెట్ గా చేసుకుంటూ హత్యలు చేస్తున్నాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ మూవీతో దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి జంటగా నటించగా మరో కీలక పాత్రలో పూజాభట్ నటించింది. తనకు సవాల్ గా మారిన సైకో కిల్లర్ ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సన్నీ డియోల్ నటించాడు.
లెజెండరీ దర్శకుడు గురుదత్ కు నివాలిగా ఈ మూవీలోని కొన్ని అలనాటి మేటి సినిమాల చిత్రాలను చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ ట్రైలర్ ఒళ్లు గర్పొడిచే సంఘటనలతో సాగుతూ ఆకట్టుకుంటోంది. గతంలో విభిన్నమైన సినిమాలని అందించిన బాల్కీ ఈ సారి సైకో థ్రిల్లర్ కథతో వస్తుండటంతో ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.