Begin typing your search above and press return to search.
ఆది తప్ప అంతం లేని బడ్జెట్ సినిమా
By: Tupaki Desk | 26 May 2016 7:30 AM GMTకుర్ర హీరో ఆది చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. లాంఛింగ్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడ్డంతో కెరీర్ సంక్షోభంలో పడిపోయింది. కోట్లు ఖర్చు చేసి స్వయంగా తండ్రి సాయికుమార్ రంగంలోకి దిగినా.. కొడుకు కెరీర్ ని గాడిలో పెట్టలేకపోయాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గరం.. ఆదికి ఓ పీడకల లాంటి రిజల్ట్ ను ఇచ్చింది.
ఇప్పుడు చుట్టాలబ్బాయి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది. ఈ మూవీ డైరెక్టర్ వీరభద్రం చౌదరి పరిస్థితి మరీ దారుణం. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కెరీర్ లోనే బ్లాక్ మార్క్ లా మిగిలిపోయిన భాయ్ తర్వాత.. ఈ చుట్టాలబ్బాయిని చేస్తున్నాడీ దర్శకుడు. ఫ్లాప్ హీరో - ఫ్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలే అంతంతమాత్రంగా ఉంటే.. ఇప్పుడీ సినిమాకి బడ్జెట్ సమస్యలు కూడా ఎక్కువైపోయాయని అంటున్నారు.
భారీ సినిమాలో ఆరు నెలల్లోపు షూటింగ్ పూర్తయి విడుదలయిపోతున్న రోజుల్లో.. ఆది నటించిన ఈ చుట్టాలబ్బాయికి ఏడాదికి పైగా షూటింగ్ చేయడం ఆశ్చర్యకరం. గతేడాది జూన్ లో మొదలైన ఈ మూవీ ఆది తప్ప అంతం లేకుండా సాగుతోంది. మొదట 4 కోట్లతో సినిమా చేద్దామని అనుకుంటే.. ఇప్పటికే 7 కోట్లకు పైగా లెక్క తేలిందట. హీరో - డైరెక్టర్ ట్రాక్ రికార్డును చూస్తే.. ఈ మొత్తం రికవరీ కావడంపై నిర్మాలు బెంగ పెట్టేసుకున్నారని అంటున్నారు. మరి రిజల్ట్ పరిస్థితి ఏంటో తెలియాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే.