Begin typing your search above and press return to search.
బ్లడీ మేరీ కేసును చేధించడానికి వస్తోన్న సీఐ ప్రభాకర్..!
By: Tupaki Desk | 7 April 2022 7:11 AM GMT''బ్లడీ మేరీ'' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో దక్షిణాది హీరోయిన్ నివేతా పేతురాజ్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 'ప్రేమమ్' ఫేమ్ చందు మొండేటి ఈ ఒరిజినల్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇది టాలెంటెడ్ డైరెక్టర్ కు డిజిటల్ డెబ్యూ.
పాపులర్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా వేదికగా 'బ్లడీ మేరీ' ఒరిజినల్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన నివేదా పేతురాజ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో బ్రహ్మాజీ - కిరీటి - రాజ్ కుమార్ కసిరెడ్డి పాత్రలకు సంబంధించిన లుక్స్ ని రివీల్ చేశారు.
తాజాగా 'బ్లడీ మేరీ' లో కీలక పాత్ర పోషించిన అజయ్ పాత్రని మేకర్స్ పరిచయం చేసారు. ఇందులో సీఐ ప్రభాకర్ అనే క్యారక్టర్ లో అజయ్ కనిపించనున్నాడు. బ్లడీ మేరీ కేసుని చేధించడానికి సీఐ త్వరలో రాబోతున్నాడని పేర్కొన్నారు.
అంధురాలైన మేరీ తనలోని లోపాలను అధిగమించి, శత్రువులతో ఎలా పోరాడింది? తన ప్రియమైన వారిని ఎలా కాపాడుతుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ''బ్లడీ మేరీ'' సిరీస్ ని రూపొందించినట్లు తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు.
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి 'ఆహా వీడియో' ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో వస్తోంది. ఇటీవల స్ట్రీమింగ్ చేయబడిన వెబ్ సిరీస్ లు మంచి వ్యూయర్ షిప్ సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'బ్లడీ మేరీ' వంటి ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ తో రాబోతోంది. ఏప్రిల్ 15న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.