Begin typing your search above and press return to search.

ఈ గాసిప్స్ నిజమైతే బాగుండును...!

By:  Tupaki Desk   |   28 Aug 2020 10:50 AM GMT
ఈ గాసిప్స్ నిజమైతే బాగుండును...!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - కృష్ణం రాజు - శోభన్ బాబు లు కలిసి నటించడానికి ఎప్పుడు రెడీగా ఉండేవారు. కానీ ఆ తర్వాతి తరం హీరోలు మాత్రం మల్టీస్టారర్స్ చేయడానికి ముందుకు రాలేదు. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు పదుల కొద్దీ సినిమాలు చేసినా ఎప్పుడూ కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ ఊపందుకుంటున్నాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్' అనే భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - అల్లు అర్జున్ కలయికలో ఓ మల్టీస్టారర్ రానుందని.. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

కాగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత మరో సినిమా చేయాల్సి ఉండగా అది ఇంతవరకు కుదరలేదు. మరోవైపు అల్లు అర్జున్ తో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ అది ఇప్పుడు పక్కన పెట్టేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరిని పెట్టి 'ఆర్.ఆర్.ఆర్' ని మించిన మల్టీస్టారర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని ఓ రూమర్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రభాస్ - బన్నీ కాంబోలో మూవీ సాధ్యపడే పనేనా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ చేస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పట్టాలెక్కిందంటే ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో మల్టీస్టారర్ తీయాలంటే అలాంటి దర్శకుడే కావాలి. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జక్కన్న కాకుండా మరో డైరెక్టర్ ని నమ్మి భారీ మల్టీస్టారర్ చేసే ధైర్యం స్టార్ హీరోలు చేయకపోవచ్చు. ఎంత మంచి కథ దొరికినా వేరే దర్శకుడిని నమ్మి సినిమా చేస్తారనేది అనుమానమే. ఇంతకముందు సూపర్ స్టార్ మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ లతో అల్లు అరవింద్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ రూమర్స్ గానే మిగిలిపోతాయని.. నిజంగా ఈ గాసిప్స్ నిజమైతే బాగుంటుందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.