Begin typing your search above and press return to search.
'సినిమా బండి' ట్రైలర్: సినిమా తీయాలని సంకల్పించిన ఆటో డ్రైవర్ కథ
By: Tupaki Desk | 30 April 2021 7:56 AM GMT'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో సత్తా చాటిన తెలుగు దర్శకులు రాజ్ & డీకే రూపొందించిన లేటెస్ట్ తెలుగు సినిమా ''సినిమా బండి''. ప్రవీణ్ కాండ్రేగుల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వసంత్ మరింగంటి రచన చేసాడు. ఈద్ సందర్భంగా మే 14న ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'సినిమా బండి' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
తన ఆటోలో దొరికిన ఖరీదైన డిజిటల్ కెమెరాతో తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చేయాలనుకున్న ఆటో డ్రైవర్ కథ ఇదని 'సినిమా బండి' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మహేష్ బాబు - ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ నటించిన సినిమాలు తీయడానికి ఉపయోగించేది ఇలాంటి కెమెరాలేనని .. మనం కూడా దీంతో ఓ సక్సెస్ ఫుల్ సినిమా చేసి డబ్బులు సంపాదించాలని.. వాటితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించే ఇన్నోసెంట్ యువకులను ఇందులో చూపించారు. గ్రామస్తులనే నటీనటులుగా పెట్టి తమకు అందుబాటులో ఉన్న వాటితో సినిమా తీయడం కోసం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేవి ఫన్నీగా చెప్పబడ్డాయి.
సినిమాలు చూస్తూ పెరిగిన ఎవరైనా సినిమా తీయొచ్చా?, తెరపై కనిపించే కథ కంటే దాని వెనుక ఎక్కువ కథ దాగి ఉంటుందనే విషయాలని 'సినిమా బండి' చిత్రంలో చెప్పబోతున్నారు. ట్రైలర్ లో సినిమా తీయడం కోసం ఇద్దరు ఇన్నోసెంట్ యువకులు నిజాయితీగా చేసే ప్రయత్నాలు ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు నవ్వు తెప్పిస్తున్నాయి. మొత్తం మీద ఫన్నీగా సహజంగా ఆసక్తికరంగా ఉన్న 'సినిమా బండి' ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకద్వయం రాజ్ & డీకే డి2ఆర్ బ్యానర్ పై నిర్మించారు.