Begin typing your search above and press return to search.

బాల‌య్య కు మ‌ళ్లీ రాజీ త‌ప్ప‌లేదా?

By:  Tupaki Desk   |   4 March 2020 7:15 AM GMT
బాల‌య్య కు మ‌ళ్లీ రాజీ త‌ప్ప‌లేదా?
X
న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 106 వ‌ చిత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు స్ర్కిప్ట్ లాక్ అవ్వ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించాల‌ని బోయ‌పాటి క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. న‌టీన‌టులు స‌హా టెక్నిషియ‌న్ల ఎంపిక‌పై కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే కొంత మందిని ఫైన‌లైజ్ చేసారు. అయితే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎవ‌ర్ని తీసుకుంటారు? అన్న దానిపై కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య‌-బోయ‌పాటి గ‌త చిత్రాల‌కు ప‌ని చేసిన సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ రాంప్ర‌సాద్ ని తీసుకోవాల‌ని బోయ‌పాటి ప్లాన్ చేసాడు. కానీ బాల‌య్య గ‌త సినిమా రూల‌ర్ లో బాల‌య్య‌ని రాంప్ర‌సాద్ స‌రిగ్గా చూపించ‌లేద‌ని విమ‌ర్శలు వెల్లు వెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాంప్ర‌సాద్ ని బాల‌య్య కొన‌సాగించ‌డ‌ని..ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు కూడా త‌లెత్తిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వేడెక్కించాయి. ప్ర‌త్యామ్నాయంగా మ‌రో చాయాగ్రాహ‌కుడిని అన్వేషించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు వార్త‌లొచ్చాయి. అయితే ఈ ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేద‌ని తాజా స‌మాచారం. టాప్ టెక్నీషియ‌న్లు అంతా ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నారుట‌. పైగా బాల‌య్య తో తాజా స‌న్నివేశం నేప‌థ్యం లో అత‌నితో ప‌ని చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదుట‌.

దీంతో మ‌ళ్లీ బాల‌య్య రాజీకి వ‌చ్చి రాంప్ర‌సాద్ నే తీసుకుందామ‌ని భావిస్తున్నారుట‌. బోయ‌పాటికి ఇప్ప‌టికే మాట్లాడ‌మ‌ని సంకేతాలిచ్చిన‌ట్లు స‌మాచారం. కార‌ణాలు ఏవైనా బాల‌య్య మ‌రోసారి రాజీకి రావాల్సి వ‌చ్చింద‌న్న వార్త ఫిలిం స‌ర్కిల్స్ లో హైలైట్ అవుతోంది. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ విష‌యంలో ఎంత ఆచితూచి వ్య‌వ‌రించిరా బోయ‌పాటి నుంచి త‌ను అనుకున్న‌ది పూర్తి స్థాయిలో రాబ‌ట్ట‌లేక తానే రాజీకి రావాల్సి వ‌చ్చింద‌ని ఓ వార్త వెడెక్కిస్తోంది. ఇంత‌లో టెక్నీషియ‌న్ విష‌యంలోనూ మ‌ళ్లీ రాజీ తప్ప‌లేద‌ని కామెంట్లు ప‌డుతున్నాయి.