Begin typing your search above and press return to search.
బాహుబలి-2.. ఓ మెట్టు పైనే
By: Tupaki Desk | 26 Sep 2016 8:16 AM GMT‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఓ మెట్టు పైనే ఉంటుందంటున్నాడు సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్. ‘సై’ దగ్గర్నుంచి రాజమౌళి సినిమాలన్నింటికీ ఛాయాగ్రహణం అందిస్తున్న సెంథిల్.. ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి-2 గురించి.. మూడేళ్లుగా ‘బాహుబలి’తో ప్రయాణం గురించి ముచ్చటించాడు.
‘‘బాహుబలి తొలి భాగం అంత పెద్ద విజయం సాధిస్తుందని మేం అనుకోలేదు. ఆ విజయం ఇప్పుడు మాపై మరింత బాధ్యతను పెంచింది. అందుకే మరింత కష్టపడుతున్నాం. తొలి భాగానికి ఏ మాత్రం తీసిపోకుండా.. ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎత్తులోనే రెండో భాగాన్ని నిలిపేలా తెరకెక్కిస్తున్నాం. ‘బాహుబలి’ కోసం నేను 2013లో రామోజీ ఫిలింసిటీకి వచ్చాను తొలి భాగం పూర్తయ్యాక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నా. ఆ తర్వాత రెండో భాగం చిత్రీకరణ ప్రారంభమైంది. మూడేళ్లలో నేను అత్యధిక సమయం ఇక్కడే గడిపాను. ఫిలింసిటీ నాకు ఇల్లులాగా మారిపోయింది’’ అని సెంథిల్ అన్నాడు.
తనకు కూడా దర్శకుడు కావాలని ఉందని సెంథిల్ చెప్పాడు. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ గా బజీగా ఉన్నానని.. సరైన సమయంలో దర్శకుడిగా మారుతానని అతను చెప్పాడు. తనకు తానుగా ఓ కథ రాసుకుని దర్శకత్వం మొదలుపెడతానని.. సరైన ఆలోచన రాగానే ఆ పనిలో పడతానని సెంథిల్ తెలిపాడు.