Begin typing your search above and press return to search.
మట్టి మనిషిగా సినీస్టార్.. లాక్ డౌన్ వేళ వ్యవసాయం!
By: Tupaki Desk | 20 Jun 2021 2:30 AM GMTసినిమా నటులు తెరపై వ్యవసాయం చేయడం కామన్. కానీ.. తెర వెనుక పొలం మడిలోకి దిగడం అరుదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే నేలపై ప్రేమతో.. మట్టి మనుషులుగా మారిపోతారు. తెలుగు సినిమా నటుల్లో పవన్ కల్యాణ్ వ్యవసాయ క్షేత్రంలో అప్పుడప్పుడూ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ మాత్రం నిజమైన రైతుగా మారిపోయారు!
ఉత్తర ప్రదేశ్ లోని బుదానాలో నవాజ్ సిద్ధికీ కుటుంబానికి వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన నవాజ్ కు.. వ్యవసాయం చేయడం కూడా పూర్తిగా తెలుసు. అందుకే.. లాక్ డౌన్ వేళ ఆయన అసలైన రైతుగా మారిపోయారు. విత్తనాలు కూడా వేసేశారు.
తొలిదశ లాక్ డౌన్ సమయంలో స్వస్థలానికి వెళ్లిపోయిన నవాజ్.. అప్పుడు కూడా వ్యవసాయ పనులు చేశారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత తిరిగి ముంబై వచ్చారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి తిరిగి వెళ్లారు. కాగా.. మహారాష్ట్రలో షూటింగులకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. నవాజ్ మాత్రం ఇంకా ముంబై రాలేదు.
అంతేకాదు.. ఇప్పట్లో రాలేనని కూడా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం తన గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలని భావిస్తున్నానని, పంటలు పూర్తయిన తర్వాతే తిరిగి ముంబైలో అడుగు పెడతానని చెబుతున్నాడు నవాజుద్దీన్. వెండి తెరపై ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఇంకా వ్యవసాయం చేస్తుండడం ఖచ్చితంగా విశేషమే కదా.. ఏమంటారు?