Begin typing your search above and press return to search.

సర్కిల్ ట్రైలర్.. కొత్తగా ఉందే..!

By:  Tupaki Desk   |   26 Jun 2023 5:15 PM GMT
సర్కిల్ ట్రైలర్.. కొత్తగా ఉందే..!
X
దాదాపు అందరి చూపు పెద్ద సినిమాల పైనే ఉంటాయి. కానీ, పెద్దహీరోలు సంవత్సరానికి ఒక్క సినిమానే చేస్తారు. ఆ గ్యాప్ లో మనల్ని ఎక్కువగా అలరించేది చిన్న సినిమాలే. పెద్ద అంచనాలు లేకుండా వచ్చి హిట్ కొట్టేసిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ సర్కిల్ మాత్రం అంచనాలు పెంచుతూ, హిట్ కొట్టడానికి రెడీ అవుతోంది.

ప్రేక్షకుడి ఊహ కు అందని విధంగా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడం లో డైరెక్టర్ నీలకంఠ ఒకరు. గతం లో షో అనే సినిమా తో ఆయన మన ముందుకు వచ్చారు. ఆ సినిమాకి రెడు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న తాజా చిత్రం సర్కిల్. "ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ కూడా ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులు అవుతారో ఎవరికీ తెలీదు డైలాగ్ తోనే మొదలైంది. హీరో జీవితం లో కొందరు అమ్మాయిలు పరిచయం అవ్వడం,వారి తో సరదాగా గడుపుతూ ఉంటారు. అలాంటి జీవితం లోకి విలన్ ప్రవేశించాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలా మారింది అనేది కథ. కాగా. సినిమా లోని కథల చుట్టూ కథ సర్కిల్ రూపం లో తిరుగుతూ ఉంటుంది. మూవీ లోని రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. విలన్ గా బాబా మాస్టర్ డిఫరెంట్ గా కనిపించారు.బాబా మాష్టర్ చెప్పిన డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి లాగబడతాడు. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. ఈ ప్రాబ్లమ్స్ ని దాటుకుని తను బయట కు రాగలిగాడా లేదా అనే విషయం ఆధారంగా సినిమా తెరకెక్కించారు.

ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శరత్ చంద్ర, సుమలత అన్నీత్ రెడ్డి, వేణు బాబు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జులై 7వ తేదీన ప్రేక్షఖుల ముందుకు రానుంది.