Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్
By: Tupaki Desk | 9 Nov 2021 5:30 PM GMTఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చేతికి గాయం అయ్యిందని.. దాంతో ఆయనకు వైధ్యులు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆ విషయమై తాజాగా స్పష్టతను ఇస్తూ ఎన్టీఆర్ ఫొటో బయటకు వచ్చింది. నిజంగానే ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యిందని.. అందుకు ఆపరేషన్ చేయించుకున్నాడని ఈ ఫొటో చూస్తే క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ ను కలిసిన ఒక బామ్మ చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఆమె అభిమానంకు ఎన్టీఆర్ కూడా ముగ్దుడు అయ్యాడు. ఆమెను హగ్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేయి కి అయిన గాయం ను చూడవచ్చు. ఎన్టీఆర్ ఈ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం కాస్త బరువు పెరిగాడు. ఆ బరువును కొరటాల శివ సినిమా కోసం తగ్గాల్సి ఉంది. అందుకే ఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది. చేతికి జరిగిన సర్జరీతో రెండు నెలల పాటు పూర్తిగా వర్కౌట్స్ కు దూరంగా ఉండాలని వైధ్యులు సూచించారట. 15 రోజుల్లో సర్జరీకి సంబంధించిన విషయం నార్మల్ అయినా కూడా పూర్తి స్థాయిలో మళ్లీ వర్కౌట్స్ మొదలు పెట్టడం కోసం మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిందే అని వైధ్యులు అన్నారట. ఆ చేతిని ఉపయోగించకుండా ఎన్టీఆర్ రెగ్యులర్ గా కొద్ది పాటి వ్యాయామం మాత్రం చేసే అకవాశం ఉంది.
ఇప్పటికే ఎన్టీఆర్.. కొరటాలల మూవీ ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఆగస్టులోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చినా కరోనా వల్ల సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. వచ్చే సంక్రాంతి తర్వాత సినిమా ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్న సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదం.. వర్కౌట్స్ చేయకూడదు అంటూ వైధ్యులు చెప్పడంతో వీరి కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అవ్వబోతున్నారు. ఎన్టీఆర్ చేయి గాయం అప్పటి వరకు మానే అవకాశాలు ఉన్నాయి కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటాడని యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు