Begin typing your search above and press return to search.

RRR: చరణ్ - అలియా సాంగ్ పై క్లారిటీ వచ్చినట్లేనా..?

By:  Tupaki Desk   |   4 Dec 2021 11:30 AM GMT
RRR: చరణ్ - అలియా సాంగ్ పై క్లారిటీ వచ్చినట్లేనా..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీమ్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే RRR నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఈ నెల 3వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే గేయ రచయిత సీతారామశాస్త్రి మరణించడంతో పోస్ట్ పోన్ చేసారు. ఎప్పుడు విడుదల చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు నార్త్ మార్కెట్ లో బజ్ తీసుకురావడానికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ - రామ్ చరణ్ ల మీద జక్కన్న ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదంతా నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం హాలిడే కోసం స్విట్జర్లాండ్ లో ఉన్నారు. సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది.

ఒకవేళ నిజంగా రాజమౌళి ఓ పాట చిత్రీకరణకు ప్లాన్ చేసి ఉంటే మాత్రం రామ్ చరణ్ ని హాలిడే కి వెళ్లేవారు కాదు.. జక్కన్న కూడా అందుకు అనుమతించే అవకాశమే లేదు.

దీనిని బట్టి చూస్తే చెర్రీ - అలియా లపై ఓ సాంగ్ షూట్ చేస్తారనేది ఒక రూమర్ మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది. అయినా సినిమాకు పబ్లిసిటీ చేసుకునే విషయంలో మాస్టర్ స్టోరీ టెల్లర్ జక్కన్న ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకు వెళ్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

'బాహుబలి' సినిమాని పాన్ ఇండియా వైడ్ జనాలల్లోకి తీసుకెళ్లడంలో ఏవిధంగా సక్సెస్ అయ్యారో చూసాం. ఇప్పుడు RRR మూవీని కూడా అలానే ముందుకు తీసుకెళ్తున్నారు.

ట్రైలర్ తోపాటుగా రాబోయే రోజుల్లో వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ - టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసారు. ఇప్పటికే ఉత్తరాదిలో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు కొత్తగా ట్రిపుల్ ఆర్ కు బజ్ తీసుకురాడానికి స్పెషల్ సాంగ్స్ షూట్ చేయాల్సిన అవసరం లేదు.

కాగా, ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా RRR తెరకెక్కుతోంది. ఇందులో అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీం గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా ఆలియా భట్‌ - తారక్ సరసన ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటించారు.

అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.