Begin typing your search above and press return to search.
కె.విశ్వనాథ్ చేసిన కామెంట్ వేరయా!!
By: Tupaki Desk | 31 Oct 2015 8:05 PM GMTమెగాస్టార్ చిరంజీవి గత వైభవాన్ని కోల్పోయారు. మాస్ లో ఇప్పుడు అంత ఫాలోయింగ్ లేదు. అతడు మాస్ కోసం కాదు.. ఇక నుంచి విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చింది.. అంటూ కళాతపస్వి కె.విశ్వనాథ్ కామెంట్ చేశారన్నది వచ్చిన ఓ న్యూస్. ఇటీవలే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ (HM TV) కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కె.విశ్వనాథ్ పైవిధంగా స్పందించారన్న వాదన వినిపిస్తోంది.
అయితే కళాతపస్వి మెగాస్టార్ కి వ్యతిరేకి కాదన్నది వాస్తవం. అసలు ఆ ఇంటర్వ్యూని మెగాభిమానులు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అసలు కళాతపస్వి అలా అనలేదు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాల పరంగా గ్యాప్ వచ్చింది. పైగా రాజకీయాల్లోకి వెళ్లాక బోలెడంత పరిణతి వచ్చింది. అతడి అభిమానిగా నేను తననుంచి ఓ విలక్షణమైన సినిమానే కోరుకుంటున్నా. 150వ సినిమా రెగ్యులర్ మాస్ మసాలా కంటెంట్ తో ఉండకూడదు. అదో వైవిధ్యమైన ఎంటర్ టైనర్ అయ్యి ఉండాలి.. అని కళాతపస్వి చెప్పుకొచ్చారు.
ఇకపోతే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న సినిమా ఎనలిస్టులు.. అసలు మెగాస్టార్ అన్న బిరుదే వ్యర్థం అన్నట్టుగా మాట్లాడారే.. అంటూ సదరు వెటరన్ దర్శకుడిపై అభియోగం మోపారు. బాలీవుడ్ లో అమితాబ్ ఇప్పటికీ మెగాస్టార్ బిరుదును కలిగి ఉన్నారు. ఖాన్ ల త్రయం అంతకంటే గొప్ప సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేకాడిస్తున్నారు. అయినా బిగ్‌బిని మెగాస్టార్ గా పిలవడం లేదా అంటూ ఫ్యాన్సు అనవసరంగా కళాతపస్విపై తూటాలు ఎక్కెపెట్టారు కాని.. నిజానికి విశ్వనాథ్ చెప్పింది వేరే. ఆయన కూడా చిరంజీవి అభిమానినే ఇంకా అని చెప్పుకున్నారు.