Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ కు ఒమిక్రాన్ వార్తలపై క్లారిటీ
By: Tupaki Desk | 14 Dec 2021 10:31 AM GMTకరోనా థర్డ్ వేవ్ ఇండియాలో ప్రారంభం కాబోతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో మెల్ల మెల్లగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అంతకు ముందు ఫస్ట్ వేవ్ సమయంలో సెలబ్రెటీలు ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రెటీలు కరోనా బారిన పడటం మొదలు అయ్యిందంటే కొత్త వేవ్ మొదలు అవుతున్నట్లే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కూడా కరోనా బారిన పడ్డట్లుగా అధికారికంగా ప్రకటించారు. కరీనా ఆరోగ్యంగానే ఉన్నారు.. కాని ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని ముంబయి వర్గాల వారు అంటున్నారు.. ఇదే సమయంలో బాలీవుడ్ మీడియా వర్గాల్లో కరీనాకు సోకింది సాదారణ కరోనా కాదని.. అది కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ అంటూ ప్రచారం మొదలు అయ్యింది.
ఒమిక్రాన్ వేరియంట్ సోకడం వల్లే కరీనాలో ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ కొన్ని నెలల క్రితమే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. కనుక ఆమె కు సాదారణ కరోనా సోకే అవకాశం లేదు అందుకే ఆమె ఖచ్చితంగా ఒమిక్రాన్ వేరియంట్ వల్లే సఫర్ అవుతుందని కొందరు అంటున్నారు. ఈ సమయంలో కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తనకు కరోనా పాజిటివ్ అనే మాట వాస్తవం. కాని మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా అది ఒమిక్రాన్ వేరియంట్ కాదని.. ఇప్పటికే ఆ విషయమై వైధ్యులు పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ అని నిరూపితం కాలేదు అంటూ కరీనా చెప్పుకొచ్చింది.
ముంబయి మీడియా వర్గాల్లో వస్తున్న పుకార్లు ఆమె అభిమానులను ఆందోళన పరుస్తున్న సమయంలో ఆమె చేసిన ప్రకటన కాస్త రిలాక్స్ అయ్యేలా చేశాయి. కరీనా ఇంకా మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇలా పాజిటివ్ అవ్వడం జరిగిందని విచారం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని కరీనా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఆమె పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన తర్వాత కూడా పార్టీలకు హాజరు అయినట్లుగా ముంబయి మున్సిపల్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెపై అధికారులు సీరియస్ అయ్యారని తెలుస్తోంది.