Begin typing your search above and press return to search.
'పుష్ప 2' పై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు!
By: Tupaki Desk | 20 Dec 2022 10:40 AM GMT'కార్తికేయ 2' తో పాన్ ఇండియా స్టార్ గా మారి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు నిఖిల్ . ఈ మూవీ తరువాత నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ '18 పేజెస్'. సుకుమార్ కథ అందించిన ఈ మూవీకి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై రూపొందిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఓ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్ లో నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించడం, ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం, బన్నీ వాసు నిర్మించిన సినిమా కావడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించిన బన్నీ 'పుష్ప 2' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చేశాడు. గత కొన్ని రోజులుగా 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ పై భిన్న కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, లేదు లేదు కాలేదని ఇలా రక రకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారి అభిమానుల్ని కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. దీంతో ఇంతకీ 'పుష్ప 2' షూటింగ్ మొదలైందా? కాలేదా? అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ '18 పేజెస్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చేశారు. బన్నీ మాట్లాడుతూ నా ఫేవరేట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. నా దర్శకుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషీ సుకుమార్ ఈ సినిమాకు నిర్మాత.
సుకుమార్ లేకపోతే నా ప్రయాణం ఇలా వుండేది కాదు. థాంక్యూ సోమచ్ డార్లింగ్ . నా సినిమా ఎంత లేట్ అయినా తనని అడగలేను. అన్నాడు. పుష్ప 2 గురించి మాట్లాడుతూ నేను ఎక్కవ చెప్పట్లేదు. అహంకారంతో చెప్పట్లేదు. 'పుష్ప 2' నెక్స్ట్ లెవెల్లో వుంటుంది. అస్సలు తగ్గేదేలే. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపాడు. 'పుష్ప 2' షూటింగ్ గురించి సుకుమార్ మాట్లాడుతూ 'జస్ట్ 5 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని, టీజర్ ని రిలీజ్ చేయాలనుకున్నామని, అయితే అది అనుకున్న సమయానికి రెడీ కాలేదని ఇండైరెక్ట్ గా వెల్లడించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.