Begin typing your search above and press return to search.
రిలేషన్ రూమర్ లపై క్లారిటీ ఇచ్చేశారు!
By: Tupaki Desk | 18 Aug 2022 9:34 AM GMTటాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పంజాబీ సోయగం ఛార్మి. 'నీతోడు కావాలి' సినిమాతో అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఇండస్ట్రీలో వున్న టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. భారీ హిట్ లని తన ఖాతాలో వేసుకుని క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే గత కొంత కాలంగా నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అచితే ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని, ఇద్దరు లీవిన్ రిలేషన్ లో వున్నారంటూ గత కొంత కాలంగా వరుస కథనాలు ప్రముఖంగా వినిపిస్తూ నే వున్నాయి. అయితే వీటిని లైట్ తీసుకున్న పూరి, ఛార్మి పెద్దగా ఏనాడూ స్పందించలేదు. తమపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా తమపై వస్తున్న రిలేషన్ రూమర్ లపై క్లారిటీ ఇచ్చేశారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ మూవీని ఆగస్టు 25న తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా పూరి, ఛార్మి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా తమపై వస్తున్న రూమర్ లక చెక్ పెట్టారు. ముందుగా పూరి జగన్నాథ్ ఈ రూమర్ లపై స్పందించారు. 'ఛార్మీ 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో ఎఫైర్ వుందని ఏదేదో మాట్లాడుకుంటారు.
ఆమె ఇంకా యంగ్ గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే ఛార్మీకి 50 ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడే వారు కాదు. ఆమెకు వేరే వాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునే వారు కాదు. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఒక వేళ అఫైర్ వున్నా అది ఎక్కువ రోజులు నిలబడదు. ఆకర్షణ కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే' అంటూ పుకార్లకు చెక్ పెట్టారు.
ఇక దీనిపై ఛార్మీ కూడా తనదైన స్టైల్లో స్పందించింది. ప్రజలు ఎల్లప్పుడూ తమ దృష్ట కోణం నుంచే ఆలోచిస్తారు. కామెంట్ లు చేస్తారు. ఆ హక్కు వారికి వుంది. లైగర్, జనగణమన భారీ విజయాల తరువాత అంతా పూరి సర్ ని, నన్ను రోల్ మోడల్ గా తీసుకుంటారు. మేము ఈ దశకు ఎలా చేరుకున్నామనే దాని గురించి చర్చిస్తారు. అయితే మాపై వచ్చే రూమర్స్, రిలేషన్ షిప్ ల గురించి నేను బాధపడను.. పట్టించుకోను అని క్లారిటీ ఇచ్చింది ఛార్మి.