Begin typing your search above and press return to search.

సమంత బాలీవుడ్ అరంగేట్రం పై క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:41 AM GMT
సమంత బాలీవుడ్ అరంగేట్రం పై క్లారిటీ
X
గ‌త కొంత‌కాలంగా స‌మంత బాలీవుడ్ ఎంట్రీ పై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వార్త‌ల‌పై సామ్ స్పందించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో హిందీ OTT ప్రపంచంలోకి గ్రాండ్ గా అరంగేట్రం చేసినప్పటి నుండి బాలీవుడ్ లో సమంతా అరంగేట్రం గురించి అనేక పుకార్లు వచ్చాయి. ఆమె ఇప్పటికే ఒక సినిమాకి సంతకం చేసిందని కొన్ని నివేదికలు వెలువ‌డ్డాయి. మరికొందరు ఆమె ముంబైలో ఇల్లు కొన్నందున హిందీ చిత్రాలు ఎక్కువ చేస్తుంద‌ని.. అలాగే సైమ‌ల్టేనియ‌స్ గా సౌత్- హిందీ ప‌రిశ్ర‌మ‌ల్ని బ్యాలెన్స్ చేయ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

చాలా పుకార్ల త‌ర్వాత‌ చివరకు సామ్ నోటి నుండే సమాధానం వ‌చ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ ఎంట్రీ పై ప్ర‌స్థావిస్తూ...``ఎందుకు కాదు,.. సరైన స్క్రిప్ట్ వస్తే.. నేను ఖచ్చితంగా ఆసక్తిగా ఉన్నాను. నాకు భాష ముఖ్యమైన అంశం కాదు. స్క్రిప్ట్ ను ఎంచుకోవాలనే నిర్ణయం పూర్తిగా సహజమైనది. స్క్రిప్ట్ ఉందా? హృదయం లోకి ఎక్కుతుందా? నేను దానికి సరిపోతానా? నేను దానికి న్యాయం చేయగలనా? ఇలా నాకు నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కి సంతకం చేసే ముందు వేసుకునే ప్రశ్నలు ఇవి.. అని అన్నారు.

దాంతో ఈ సౌత్ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియ‌రైన‌ట్టేన‌ని అర్థ‌మైంది. అయితే మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది అన్న‌ది వేచి చూడాలి. తాప్సీ పన్ను నిర్మాణంలో ఆమె తన తొలి హిందీ ప్రాజెక్ట్ కు సంతకం చేసిందని దాని గురించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు బలమైన క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిన‌దే.

మనోజ్ బాజ్ పేయి నేతృత్వంలోని `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో `రాజ్జీ`గా సమంత ప్రభు అత్యంత ఆకర్షణీయమైన పరివర్తనాత్మకమైన నటనతో ప్రేక్షకులు విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. అప్పటి నుండి ఆమె దక్షిణాదిలో ది బెస్ట్ స్టార్ అన్న పాపులారిటీ ద‌క్కించుకుంది. ఇటీవల షాహిద్ కపూర్- తాప్సీ పన్ను ఇతర నటీన‌టులు సామ్ ని ప్రశంసించారు. ఆమెతో పని చేయడానికి ఆసక్తిని కనబరిచారు. ఇక‌పోతే స‌మంత లేటెస్ట్ ట్రెడిష‌న‌ల్ ఫోటోషూట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నుదుటిన తిల‌కం.. కాటుక క‌ళ్లు .. ముక్కుకు ముక్కెర‌.. నుదుటిన పాపిడి బొట్టు.. క్రిస్ట‌లైన్ డిజైన‌ర్ శారీతో సామ్ ఎంతో అందంగా మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది. ఆ జ‌రీ అంచు ప‌విట‌ను త‌ల‌పైనుంచి అలా భుజాల‌పై కి దించి మ‌రింత‌గా లుక్ ని వైబ్రేంట్ గా మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.