Begin typing your search above and press return to search.
ఆస్కార్ గౌరవం మొదట చిరుకే!
By: Tupaki Desk | 29 Jun 2022 7:30 AM GMTఇండియన్ సినిమాకు ఆస్కార్ అనేది అందని ద్రాక్ష అవుతుంది. చిన్న సినిమాలు తీస్తున్న కొరియన్ ఇండస్ట్రీకి ఆస్కార్ లు దక్కుతున్నాయి కాని వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలకు.. వేల కోట్లు వసూళ్లు సాధిస్తున్న సినిమాలకు ఆస్కార్ అవార్డులు అనేది కలగానే మిగిలి పోతున్నాయి. ఇండియన్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లడమే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి మారింది.
గత ఏడాది ఆస్కార్ అవార్డుల సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య పేరు మరియు ఆయన నటించిన జైభీమ్ సినిమా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆస్కార్ అవార్డు చివరి అడుగు వద్ద జై భీమ్ వెనక్కు వచ్చేసింది. ఇప్పుడు ఆస్కార్ 2022 కు సూర్యకు ఆహ్వానం దక్కింది అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాంతో సూర్య ఫ్యాన్స్ గాల్లో తేలినంతగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా హీరోకు దక్కిన గౌరవం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవరికి దక్కలేదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంకు సౌత్ ఇండియన్ సినీ ప్రముఖుల నుండి కేవలం సూర్యకే దక్కిందని సూర్య అభిమానులు మరియు తమిళ మీడియా చేస్తున్న హడావుడికి తెలుగు సినిమా వర్గాల వారు మరియు తెలుగు మీడియా కౌంటర్ ఇచ్చింది.
సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి 1980ల్లోనే చిరంజీవికి ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఆహ్వానం దక్కింది. ఇప్పుడు సూర్యకు దక్కినది 2022 సంవత్సరం ఆస్కార్ వేడుక ఆహ్వానం కాదు.. 2022 ఆస్కార్ అవార్డు కార్యక్రమం ఆర్గనైజర్స్ కమిటీ లో 397 మందికి సభ్యత్వం ఇచ్చారు. అందులో సూర్యకు కూడా ఛాన్స్ దక్కింది.
ఆస్కార్ ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ దక్కించుకున్న సౌత్ స్టార్ సూర్య మాత్రమే. 2021 ఆస్కార్ లో నామినేషన్ ను దక్కించుకున్న వారందరికి కూడా ఈ ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ దక్కుతుంది. అలా సూర్యకు కూడా మెంబర్ షిప్ దక్కింది.
2021 లో జై భీమ్ కు ఆస్కార్ నామినేషన్స్ దక్కడం వల్లే ఈ సంవత్సరం ఆర్గనైజర్ మెంబర్ షిప్ దక్కిందనే విషయాన్ని క్లియర్ గా తమిళ మీడియా వెళ్లడించకుండా సౌత్ నుండి సూర్య మొదటి వాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే ఆస్కార్ నుండి ఆహ్వానం దక్కించుకున్నాడు. ఆస్కార్ కార్యక్రమం ఆహ్వానం దక్కింది మొదట చిరంజీవికే.. అయితే ఆర్గనైజర్స్ మెంబర్స్ ఫిప్ మాత్రం సూర్యకు దక్కింది ఇది క్లారిటీ.