Begin typing your search above and press return to search.
సీనియర్ ఎన్టీఆర్ తో సూపర్ స్టార్ కృష్ణ గొడవలు?
By: Tupaki Desk | 5 Feb 2022 5:31 AM GMTఆహా- ఓటీటీ ఊహించని కలయికల్ని పరిచయం చేస్తోంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ ముగింపు ఎపిసోడ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పూర్తిగా జనరంజకంగా వినోదాత్మకంగా ఉంది. ఎపిసోడ్ ఆద్యంతం బాలకృష్ణ .. మహేష్ బాబుల మధ్య సాగే రహస్య సంభాషణలు రక్తి కట్టించాయి. నాటి రోజుల్లో ఎన్టీఆర్- కృష్ణ మధ్య గొడవలున్నాయంటూ ప్రచారం సాగేది.. కానీ దానిపై నేటి జనరేషన్ కి తెలిసింది తక్కువ. గుసగుసలు మాత్రమే వినిపిస్తాయి. దీనిపై మహేష్- బాలయ్య స్వయంగా క్లారిటీనిచ్చారు.
``సీనియర్ ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదు. నిజానికి కృష్ణగారు స్వయంగా ఎన్టీఆర్ గారి అభిమాని. అల్లూరి సీతారామ రాజు చూసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మా నాన్న (కృష్ణ) నటనను మెచ్చుకున్నారు. అది మాకు అరుదైన క్షణం`` అని మహేష్ బాబు అన్నారు. అంతేకాదు.. తాను బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా చూస్తానని మహేశ్ బాబు చెప్పారు. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలను చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నానని మహేష్ అన్నారు.
మహేష్ బాబు దాతృత్వ స్వభావంపైనా హోస్ట్ బాలయ్య ప్రశంసలు కురిపించారు. మహేష్ 1000 మందికి పైగా పిల్లలను వారి గుండె ఆపరేషన్లకు నిధులు సమకూర్చారు. అతను బంగారు హృదయం ఉన్న వ్యక్తి... అంటూ ప్రశంసించారు. అప్పుడు మహేష్ బాబు నిధులు సమకూర్చాలనుకోవడానికి కారణం వెల్లడించారు. ఆ సమయంలో హార్ట్ సర్జరీ ద్వారా ప్రయోజనం పొందిన ఒక పిల్లవాడు వేదికపైకి వచ్చాడు. ఆ చిన్నారితో వీళ్లు ముచ్చటించారు. ఈ సీక్వెన్స్ గొప్ప భావోద్వేగ అనుభూతిని కలిగిస్తుంది. అనంతరం మహేశ్ చెప్పిన కారణం షాకిస్తుంది.
``నా కొడుకు గౌతమ్ నెలలు నిండకుండానే పుట్టాడు. అతను పుట్టినప్పుడు నా అరచేతి పరిమాణంలో ఉన్నాడు. అతను 10 రోజులు ఇంక్యుబేటర్ లో ఉన్నాడు. గౌతమ్ ని చూసుకోవడానికి నా దగ్గర డబ్బులున్నాయి సరే కానీ... అనిపించింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి మద్దతు కోసం వెతుకుతున్న ఆర్థికంగా అంతగా ఛాన్స్ లేని తల్లిదండ్రుల గురించి ఏమిటి? అని ఆలోచించాను. నేను దాతృత్వ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి కారణమిది`` అన్నారు మహేష్. ఈ ప్రత్యేక ఎపిసోడ్ తో సీజన్ ముగింపు కి వచ్చింది. ఎపిసోడ్ ప్రారంభం నుండి చివరి వరకు ఆద్యంతం గొప్పగా అలరిస్తుంది.