Begin typing your search above and press return to search.
సమంత ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలపై క్లారిటీ..!
By: Tupaki Desk | 30 Nov 2022 10:42 AM GMTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సామ్ ఉన్నటుండి తీవ్ర అనారోగ్యానికి గురైందని.. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందంటూ తాజాగా నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. చికిత్స కోసం ఆమెను సింగపూర్ తరలించారని కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు - యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం గురించి చక్కర్లు కొడుతున్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. నటి ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలను ఆమె మేనేజర్ ఖండించారు. మెరుగైన చికిత్స కోసం సింగపూరు తీసుకెళ్లారనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలియజేసారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని.. దయచేసి ఆమె ఆరోగ్యంపై ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని సమంత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సామ్ అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లుగా రూమర్స్ వచ్చాయి. అయితే అది అవాస్తవమని.. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని ఆమె టీమ్ వివరణ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అగ్ర కథానాయిక ఆరోగ్యంపై పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
ఇకపోతే మయోసైటిస్ వంటి అరుదైన రుగ్మతతో బాధపడుతోన్న సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలోనే 'యశోద' సినిమా డబ్బింగ్ పూర్తి చేసి, రిలీజ్ కు సహకరించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'ఖుషి' సినిమా సెట్స్ మీద ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. సామ్ ఆనారోగ్యమే దీనికి కారణమని తెలుస్తోంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగిస్తే చిత్రీకరణ పునః ప్రారంభించడానికి మేకర్స్ వేచి చూస్తున్నారు.
ఇక సామ్ టైటిల్ రోల్ లో నటించిన 'శాకుంతలం' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ మీద క్లారిటీ రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.