Begin typing your search above and press return to search.
'ఆచార్య' విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
By: Tupaki Desk | 18 Sep 2021 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. చిరు - చరణ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ సాంగ్స్ షూట్ ఆలస్యమైంది. అయితే లేటెస్టుగా 'ఆచార్య' షూటింగ్ రీస్టార్ట్ అయింది.
చిరంజీవి - రామ్ చరణ్ ఇద్దరూ 'ఆచార్య' షూటింగ్ లో దిగిపోయారు. హైదరాబాద్ శివార్లలో రూపొందించిన ప్రత్యేకమైన సెట్ లో మెగా తండ్రీకొడుకుల మీద కొరటాల ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఒక వారం రోజుల పాటు షూట్ చేసే ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కు ఒక ట్రీట్ లా ఉండబోతోందని అంటున్నారు. అలానే ఇందులోని మరో పాటను ఊటీలో చరణ్ - పూజా హెగ్డే లపై చిత్రీకరించనున్నారని సమాచారం. సెప్టెంబర్ నెలాఖరు వరకు రెండు పాటల షూటింగ్ పూర్తి చేసి, వీలయినంత త్వరగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
అయితే 'ఆచార్య' సినిమా విడుదల తేదీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రామ్ చరణ్ పట్టుబడుతున్నారట. కానీ ఇప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని ఏరియాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రావాలి. అలా వస్తేనే భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా థియేటర్లలో కమర్షియల్ సక్సెస్ అవుతుంది. అందుకే థియేటర్స్ సమస్యపై క్లారిటీ వచ్చాక 'ఆచార్య' సినిమా విడుదల తేదీపై స్పష్టత రావచ్చు. ఈ వారంలో ఏపీ సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ తర్వాత చిరంజీవి సినిమా రిలీజ్ గురించి ప్రకటక వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే మంచి సీజన్స్ అన్నీ పెద్ద సినిమాలతో ఆల్రెడీ బుక్ అయిపోయున్నాయి. మరి 'ఆచార్య' కు ఏ డేట్ దొరుకుతుందో చూడాలి. కాగా, కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. చిరు - చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.